Baswareddy Farewell | అడిషనల్​ డీసీపీ బస్వారెడ్డికి ఘనంగా వీడ్కోలు..

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Baswareddy Farewell | జిల్లాలో అడిషనల్ డీసీపీగా సేవలందించిన బస్వారెడ్డికి సీపీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వీడ్కోలు (police farewell) పలికారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) కాన్ఫరెన్స్ హాల్​​లో ఈ కార్యక్రమం జరిగింది.

Baswareddy Farewell | ఎస్సై స్థాయి నుంచి..

కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ.. బస్వారెడ్డి గతంలో జిల్లాలోనే ఎస్సైగా పనిచేశారని.. అనంతరం సీఐగా, ఏసీపీగా సేవలందించారన్నారు. అదనపు డీసీపీగా విధులు నిర్వహిస్తూ తాజాగా చీఫ్​ ఆఫీస్​కు బదిలీ అయ్యారన్నారు. మృదు స్వభావిగా పేరున్న ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. శాంతిభద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.

కార్యక్రమానికి ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా(Mla Dhanpal), నిజామాబాద్​ సెక్యూరిటీ ​ కౌన్సిల్(Nizamabad Security Council)​ ఛైర్మన్​ సీపీ సాయిచైతన్య, జనరల్ సెక్రెటరీ డాక్టర్ కవితా రెడ్డి, ట్రెజరర్ సంతోష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ కాకతీయ విద్యాసంస్థల(Kakatiya Educational Institutions) అధినేత రజనీకాంత్ తదితరులు హాజరై బస్వారెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది, అభిమానులు సీపీ కార్యాలయానికి వచ్చి బస్వారెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన స్థానంలో ఐపీఎస్​ అధికారి శుభం ప్రకాష్​ నియమితులయ్యారు.

ఇది కూడా చదవండి: CCTV security | సీసీ కెమెరాలతో గ్రామాలకు భద్రత : సీపీ సాయిచైతన్య

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *