Peddi movie update | ‘నా ప్రియమైన పెద్ది రామ్ చరణ్ సర్..’ ఎమోషనల్ ట్వీట్‌తో హైప్ పెంచిన బుచ్చిబాబు

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Peddi movie update | ‘పెద్ది’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా (Bucchi Babu Sana) భావోద్వేగ ట్వీట్‌తో సినిమాపై మరింత ఆసక్తి పెంచగా… రామ్ చరణ్(Ram Charan) పాత్రపై అంచనాలు పీక్స్‌కి చేరాయి.

Peddi movie update | టీం నుంచి ఆసక్తికర అప్​డేట్​

టాలీవుడ్‌లో(Tollywood) భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘పెద్ది’ (Peddi) సినిమాపై మరో ఆసక్తికర అప్​డేట్​ బయటకు వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తన తాజా ట్వీట్​తో సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు వెల్లడించారు. “పెద్ది సెట్స్‌లో (Tollywood news) చివరి ఆరు రోజులు.. నాకెంతో స్ఫూర్తినిచ్చిన పాత్ర ఇది. నా ప్రియమైన పెద్ది రామ్ చరణ్ సర్” అంటూ ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌కు రామ్ చరణ్‌తో కలిసి తీసుకున్న సెల్ఫీని జత చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఫోటోలో చరణ్ సెల్ఫీ తీస్తుండగా, వెనుక బుచ్చిబాబు కనిపించడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.

Peddi movie update | పెద్దికి గుమ్మ‌డికాయ ఎప్పుడు కొడ‌తారంటే..

ఇప్పటికే సినిమా రిలీజ్ వాయిదాలపై విమర్శలు ఎదుర్కొంటున్న దర్శకుడు ఈ అప్​డేట్​తో ఫ్యాన్స్‌ను కాస్త శాంతింపజేసే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘పెద్ది’ షూటింగ్ (film shooting) మరికొన్ని రోజుల్లో పూర్తికానుంది. సాధారణంగా రామ్ చరణ్ (Ram Charan) తన పాత్రల్లో పూర్తిగా లీనమై నటిస్తారన్న పేరు ఉంది. అయితే ‘పెద్ది’ పాత్ర గురించి దర్శకుడు చెప్పిన మాటలు చూస్తుంటే ఇది చరణ్ కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా (Telugu cinema) నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కుస్తీ వీరుడిగా ఆయన కనిపించనున్న ఈ పాత్ర కోసం చేసిన మేకోవర్, మాస్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి.

ఇది కూడా చదవండి: Pawan Kalyan Die-Hard Fan | పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం ప్ర‌త్యేక పూజ‌లు.. ఆల‌యం మెట్ల‌న్ని మోకాళ్ల‌తో ఎక్కిన వీరాభిమాని

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *