NTR Deepfake Video | ఏఐ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ ఫైర్.. నిందితులకు గట్టి హెచ్చరిక

సోషల్ మీడియాలో సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోల వివాదం కలకలం రేపుతోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: NTR Deepfake Video | సోషల్ మీడియాలో సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోల వివాదం కలకలం రేపుతోంది. ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీలు ఏఐ బారిన పడుతుండగా, తాజాగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ( Janhvi Kapoor  ) జంటగా నటించిన ‘దేవర’ చిత్రంలోని పాపులర్ ‘చుట్టమల్లె’ పాటకు సంబంధించిన ఏఐ మార్ఫింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని గమనించిన ఎన్టీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిందితులకు గట్టి హెచ్చరిక జారీ చేస్తూ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టి నిరసన వ్యక్తం చేశారు.

NTR Deepfake Video | అత్యంత సిగ్గుచేటైన చర్య..

మహిళలను ఎంతో గౌరవించే మన సంస్కృతిలో, ఒక మహిళను ఇంతలా దిగజారి అవమానించడానికి ఏఐ టెక్నాలజీని వాడటం అత్యంత సిగ్గుచేటని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రోత పుట్టించే చర్య అని, ఈ మార్ఫింగ్ వీడియో వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఈ మార్ఫింగ్ వీడియోను తయారు చేసిన వాళ్లపైనా, సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తున్న వాళ్లపైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి చెడు కంటెంట్‌ను ఎవరూ చూడొద్దని, ఎక్కడా షేర్ చేయొద్దని ఆయన ప్రజలను కోరారు.

కNTR Deepfake Video | కఠిన చట్టాల కోసం డిమాండ్..

ఈరోజు వేరే వాళ్లతో జరుగుతున్న ఈ దారుణం.. రేపు మన కుటుంబంలోని ఆడవాళ్లకూ ఎదురుకావచ్చని అన్నారు. ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి:  Kamareddy Municipality | ఫిర్యాదులు.. ఆపై వసూళ్లు..! కామారెడ్డి బల్దియాలో నయా ట్రెండ్​కు శ్రీకారం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *