Plastic Waste Management | ఆలూర్‌లో జిల్లాలోనే తొలి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ నిర్మాణం

జిల్లాలోనే తొలిసారిగా ఆలూర్ గ్రామపంచాయతీలో రూ.32 లక్షల వ్యయంతో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్​ను నిర్మిస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Plastic Waste Management | జిల్లాలోనే తొలిసారిగా ఆలూర్ గ్రామపంచాయతీలో రూ.32 లక్షల వ్యయంతో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్​ను నిర్మిస్తున్నారు. ఈ పనులను శనివారం ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, ఎంపీవో గంగమోహన్ పరిశీలించారు.

Plastic Waste Management | పారిశుధ్య నిర్వహణ మెరుగు కోసం..

ఎంపీడీవో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోనే తొలిసారిగా ఆలూర్ (Alur) గ్రామపంచాయతీలో ఈ తరహా యూనిట్‌ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపర్చడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడమే లక్ష్యంగా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేసి, రీసైక్లింగ్‌ కోసం పంపించడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచడానికి ఈ యూనిట్‌ దోహదపడుతుందని పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేసి, యూనిట్‌ను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజలింగం, కారోబార్​ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Municipality | ఫిర్యాదులు.. ఆపై వసూళ్లు..! కామారెడ్డి బల్దియాలో నయా ట్రెండ్​కు శ్రీకారం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *