Guru Paduka Shobhayatra | కామారెడ్డిలో భక్తిశ్రద్ధలతో గురుపాదుకల శోభాయాత్ర

పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపం శుక్రవారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Guru Paduka Shobhayatra | పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపం శుక్రవారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కామారెడ్డి (Kamareddy) సాంప్రదాయక భక్త మండలి, సీతారామచంద్ర పరిపూర్ణ బోధోపదేశ మందిరం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గురు పాదుకల శోభాయాత్ర నిర్వహించారు.

Guru Paduka Shobhayatra | ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు, శిక్షణ తరగతులను

ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు, శిక్షణ తరగతులను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు కొనసాగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గురువుల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ముఖ్య బోధాధికారులు పాల్గొని శివరామ దీక్షిత సంప్రదాయ సిద్ధాంతం, శ్రీమహావిష్ణు సంప్రదాయంలోని ఉపనిషత్ ప్రమాణమైన జన్మరహిత సిద్ధాంతంపై విశేష బోధనలు చేశారు. పండితులు, పామరులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆచరించగలిగే ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రజలకు పరిచయం చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. జన్మరాహిత్య సిద్ధాంతం ద్వారా మానవాళికి ఆధ్యాత్మిక విముక్తి మార్గాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి సత్య శివప్రసాద్, ఆత్మానాత్మ నిరసనానంద మలకపల్లి సాంబశివ కుమార్, ఇలపకుర్తి పద్మజతో పాటు స్థానిక గురువులు కస్వ చంద్రశేఖర్, పార్శి జ్యోతి, నాగలక్ష్మీ దంపతులు, బోండ్ల శంకర్ తదితరులు సహకారం అందించారు. స్థానికంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు విశేష కృషి చేసిన విధేయానంద ఆరుగొండ విశ్వనాథంను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

ఇది కూడా చదవండి..: Plastic Waste Management | ఆలూర్‌లో జిల్లాలోనే తొలి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ నిర్మాణం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *