Urea Demand Controversy | యూరియా అడిగిన రైతును బండబూతులు తిట్టిన వ్యవసాయాధికారి..

యూరియా అడిగిన రైతును పరుష పదజాలంతో దూషించాడు ఓ వ్యవసాయాధికారి.

shashi kiran Mottala

అక్షరటుడే, గాంధారి: Urea Demand Controversy | యూరియా అడిగిన రైతును పరుష పదజాలంతో దూషించాడు ఓ వ్యవసాయాధికారి. ఈ ఘటన గాంధారి(Gandhari) మండలంలో చోటు చేసుకుంది.

Urea Demand Controversy | యూరియా కోసం వేడుకోగా..

వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన సోమరిపేట రవి ఆదివారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో గాంధారి వ్యవసాయాధికారికి ఫోన్​ చేశాడు. యూరియా రాక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని.. త్వరగా యూరియా ఇప్పించాలని కోరారు. ఈ విషయానికే ఆగ్రహావేశాలకు లోనైన సదరు వ్యవసాయాధికారి సదరు రైతును అనరాని మాటలు తిట్టాడు. పరుష పదజాలంతో దూషించడంతో సదరు రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనిపై రైతు సంఘాల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకోకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తామని వారు ఘాటుగా హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ఖైరతాబాద్ గణేశుడి.. వీడియో చూశారా..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *