POCSO Case | బాలికపై సామూహిక అత్యాచారం.. 9 మందిపై పోక్సో కేసు

హైదరాబాద్​ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: POCSO Case | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు ఒక బాలికపై అత్యాచారం చేశారు. పోలీసులు 9 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ బాలికకు మత్తుపదార్థాలు ఇచ్చి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు తొమ్మిది మందితో పాటు, ఒక ఓయో హోటల్ యజమాని, మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

POCSO Case | ఓయో రూమ్​కు తీసుకెళ్లి..

విక్కీ అనే యువకుడు, అతడి గ్యాంగ్ మొత్తం 9 మంది కలిసి బాలికపై అఘాయిత్యం చేశారు. ఈ నెల 8న విక్కీ బాలికకు మత్తుమందు ఇచ్చి తీసుకెళ్లారు. ఆమెను గుండ్లపోచంపల్లిలోని ఒక ఓయో రూమ్​కు తీసుకెళ్లాడు. అక్కడ బాలికకు గంజాయి తాగించి విక్కీతో సహా నలుగురు అత్యాచారం చేశారు. మరుసటి రోజు షామీర్‌పేటలోని ఒక నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌కు తరలించి విక్కీతో పాటు మరో ఇద్దరు కలిసి రేప్​ చేశారు. ఈ నెల 10న మేడ్చల్‌లో ఆగి ఉన్న ఒక రైలులోకి మరోసారి అఘాయిత్యం చేశారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్​ చేశారు.

ఈ వీడియో చూడండి: హీరోయిన్ల ఫిట్​నెస్​ సిక్రెట్​ ఇదేనా..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *