PCC Chief | తలసానిని ప్రతిపక్ష నేత చేయాలి : పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​

కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే ​నగర్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​ను ప్రతిపక్ష నేత చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PCC Chief | కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే సనత్​నగర్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​ను ప్రతిపక్ష నేత చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఇటీవల బీఆర్​ఎస్​ (BRS) నిర్వహించిన మాక్​ అసెంబ్లీలో తలసాని సీఎంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. దీనిపై మహేశ్​గౌడ్​ స్పందించారు. కేసీఆర్ ఎలాగు అసెంబ్లీకి రావట్లేదని, తలసానిని ప్రతిపక్ష నేత చేయాలన్నారు. బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయాలని స్పీకర్‌ను అడుగుతామని తెలిపారు. దళిత స్పీకర్​ను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని ఆరోపించారు.

PCC Chief | దళితులను అవమానించారు

ఉద్దేశపూర్వకంగానే స్పీకర్​పై వ్యాఖ్యలు చేశారని పీసీసీ చీఫ్​ అన్నారు. ఉద్యమంలో దళిత కార్డును కేసీఆర్ ఎలా వాడారో చూశామన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో దళితులపై అత్యాచారాలు, దాడుల వివరాలు బయటపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళిత బంధు తీసుకు వచ్చారని ఆరోపించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడం దారుణం అన్నారు. దళిత జాతిని కేసిఆర్ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖను హైకమాండ్ పిలిచినట్టు తనకు సమాచారం లేదన్నారు. 22A విషయంలో సామాన్యుడికి నష్టం జరగొద్దని, అవసరం అనుకుంటే చట్టంలో మార్పు చేయాలని సీఎం రేవంత్​రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు.

దీనిని కూడా చదవండి : Building Construction Excavation | నగరంలో భవన నిర్మాణం కోసం తవ్వకాలు.. కూలిన ప్రహరీ.. భయాందోళనలో ప్రజలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *