KTR Revanth Reddy | గోడల మీద రాతలు రాసే రేవంత్​కు అన్ని ఆస్తులు ఎక్కడివి : కేటీఆర్​

గోడల మీద రాతలు రాసే రేవంత్​రెడ్డికి అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని కేటీఆర్​ ప్రశ్నించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Revanth Reddy | గోడల మీద రాతలు రాసే రేవంత్​రెడ్డి (Revanth Reddy)కి అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ప్రశ్నించారు. తెలంగాణ భవన్​లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ పుట్టినప్పుడు చింతమడకలో ఇల్లు రెండెకరాలు ఉండేదని కేటీఆర్​ అన్నారు. తమ నానమ్మ ఊరు కోనాపూర్​లోని వందల ఎకరాల భూమి మానేరు డ్యామ్‌లో పోయిందని చెప్పారు. కేసీఆర్​కు తాత ముత్తాతల నుంచే భూములు ఉన్నాయని చెప్పారు. కానీ సీఎం రేవంత్​రెడ్డికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కొండారెడ్డిపల్లి వెళ్తే సీఎం బండారం బయటపడుతుందన్నారు. 57 ఏళ్ల నుంచి రేవంత్​రెడ్డి కుటుంబం ఆస్తులు, 72 ఏళ్ల నుంచి కేసీఆర్ కుటుంబం ఆస్తులపై విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు.

KTR Revanth Reddy | ఎవరి భూములు గుంజుకోలేదు

కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉందని వెయ్యిసార్లు అన్నారని మాజీ మంత్రి పేర్కొన్నారు. నిన్న అసెంబ్లీలో 67 ఎకరాలు ఉందని సీఎం చెప్పారన్నారు. ‘‘మీ లాగా కేసీఆర్ ఎవరి భూములు గుంజుకోలేదు.. వెయ్యి ఎకరాలంటూ ఇన్నాళ్లు తప్పుడు ప్రచారం చేసినందుకు కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలి” అని కేటీఆర్​ డిమాండ్​ చేశారు. కేసీఆర్ రైతు అని, బరాబర్ అన్ని చట్టాల ప్రకారం భూమి కొనుగోలు చేశారన్నారు.

KTR Revanth Reddy | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ అమలు చేయాలి

రేవంత్ రెడ్డి దళితుల మీద ఎక్కడ లేని ప్రేమ కనబరుస్తున్నారని కేటీఆర్​ ఎద్దేవా చేశారు. అంత ప్రేమ ఉంటే దళిత డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. కేసీఆర్ దళిత బంధు రూ.10 లక్షలు ఇస్తాను అంటే రూ.12 లక్షలు ఇస్తానని చెప్పిన రేవంత్​రెడ్డి.. ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. రేవంత్​రెడ్డి మొన్నటి వరకు తిరిగిన కారు ఎవరిదని ప్రశ్నించారు. ఆయన సోదరుడు కొండల్​రెడ్డి తిరుగుతున్న కారు ఎవరిదన్నారు. కేఎల్​ఎస్​ ఇన్​ఫ్రా కంపెనీ కార్లలో తిరిగారని, దాని ఓనర్​ రేవంత్​రెడ్డి బినామీ అని ఆరోపించారు. సీఎంకు జూబ్లీహిల్స్​లో ఇల్లు ఎక్కడినుంచి వచ్చిందని కేటీఆర్​ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి..: Telangana Liberation Day | పరేడ్​ గ్రౌండ్స్​లో తెలంగాణ విమోచన దినోత్సవం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *