అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Liberation Day | సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.
వీరసైనిక్ స్మారకం వద్ద వీరజవాన్లకు ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. అనంతర జాతీయ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, గవర్నర్ శివప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) తదితరులు పాల్గొన్నారు.
Telangana Liberation Day | ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆగస్ట్ 15, 1947న భారత్‌కు స్వాతంత్య్రం వస్తే, మనకు 13 నెలలు ఆలస్యంగా వచ్చిందని చెప్పారు. సర్దార్ పటేల్ జోక్యంతో ఈ గడ్డపై మూడు రంగుల జెండా ఎగిరిందని గుర్తు చేశారు. ఖాసీం రజ్వీ కిరాయి మూకలు చేసిన ఘోరాలను ఈ గడ్డ మరిచిపోలేదన్నారు. కానీ, మన పాలకులు ఆనాటి అరాచకాలను తొక్కిపెడుతున్నారని విమర్శించారు.
ఇది కూడా చదవండి..: Bhu Bharati Reforms | భూ భారతితో సంస్కరణలు తెచ్చాం : సీఎం రేవంత్ రెడ్డి