Telangana Bhavan | తెలంగాణ భవన్​ వద్ద హై టెన్షన్​

కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ సవాళ్ల నేపథ్యంలో తెలంగాణ భవన్​ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Bhavan | హైదరాబాద్​ (Hyderabad)లోని తెలంగాణ భవన్​ వద్ద హై టెన్షన్​ నెలకొంది. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నాయకులు సవాళ్లు విసురుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు.

తెలంగాణ అప్పులపై చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు 11 గంటలకు తెలంగాణ భవన్ వద్దకు వస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో గురుకులాల్లో అవినీతిపై తాము సైతం చర్చకు సిద్ధమని బీఆర్​ఎస్​ నాయకులు తెలిపారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తెలంగాణ భవన్​కు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

Telangana Bhavan | గన్​పార్క్​కు చేరుకున్న మంత్రులు

Telangana Bhavan

మంత్రి జూపల్లి (Minister Jupally) తెలంగాణ భవన్ కి రావాలని.. వస్తే కేంద్ర ప్రభుత్వ నివేదికలు, రిజర్వు బ్యాంకు లెక్కలతో కాంగ్రెస్ అప్పుల బాగోతాన్ని ఎండగడతామంటున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్​, అడ్లూరి లక్ష్మణ్​, అజహరుద్దీన్‌ గన్​పార్క్​కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో చర్చిద్దామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రెస్‌క్లబ్‌, తెలంగాణ భవన్‌ దగ్గర పోలీసు బలగాలను మోహరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ రానున్నారు. మరోవైపు కేటీఆర్​, హరీశ్​రావు తెలంగాణ భవన్​ నుంచి గన్​పార్క్​కు బయలు దేరారు. మంత్రులు అక్కడే ఉండాలని, తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Adibatla Fire Accident | ఆదిభట్లలో భారీ అగ్నిప్రమాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *