Armoor Development Meeting | మనలో మనమే కొట్టుకుంటే అభివృద్ధి కుంటుపడుతుంది..: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

Shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్ : Armoor Development Meeting | మనలో మనమే కొట్టుకుంటే అభివృద్ధి కుంటుపడుతుందని.. పేదలకు సంక్షేమ ఫలాలు అందాలంటే రాజకీయ ఐక్యత ఉండాలని ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి (MLA Rakesh Reddy) అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సప్తగిరి ఫంక్షన్ హాల్​లో శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు.

Armoor Development Meeting | గతంలో కక్షలు, ద్వేషాలు ఉండేవి..

ఈ సందర్భంగా రాకేష్​రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ ఫలాలు అందాలంటే అందరం ఐక్యంగా ఉండాలన్నారు. ఆర్మూర్​ (Armoor)లో గతంలో కక్షలు, ద్వేషాలు ఉండేవని ఈ రెండేళ్లలో అవి కనబడకుండా పోయాయన్నారు. అంతకు ముందు మెప్మా ఆధ్వర్యంలో స్వయంసహాయక సంఘాల ఉత్పత్తులకు సంబంధించిన స్టాళ్లను పరిశీలించారు. ఆ తర్వాత కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా (Sub-Collector Abhigyan Malviya), మున్సిపల్ ఛైర్​పర్సన్ గోనె లహరి, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంవీఐ రాహుల్ కుమార్, తహశీల్దార్ సత్యనారాయణ, మండల సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు సారంగి శాంతి కుమార్, కౌన్సిలర్ పాన్ శ్రీను, నియోజవర్గంలోని నాయకులు అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Minority School Admissions | ఎల్లారెడ్డి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *