Sadashivanagar Police | అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం..సకాలంలో స్పందించిన సదాశివనగర్ పోలీసులు

బస్సులోని ప్రయాణికులతో పాటు కారులో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదాన్ని సమయానికి అడ్డుకున్న సదాశివనగర్ పోలీసుల సేవలను స్థానికులు అభినందించారు.

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి: Sadashivanagar Police | సదాశివనగర్ పోలీసుల అప్రమత్తత, సమయస్ఫూర్తితో గురువారం సాయంత్రం భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు మర్కల్ ఎక్స్ రోడ్ సమీపానికి చేరుకోగానే సాయంత్రం 5:23 గంటల సమయంలో వెనుక టైర్ అకస్మాత్తుగా బ్లాస్ట్ అయింది. దీంతో బస్సు అదుపు తప్పే పరిస్థితి నెలకొంది.

Telangana Telugu History | ఆంధ్రుల భాష ‘ఆంధ్రం’… మనది ‘జాన తెలుగు’!: “ఇడుపు కాయితం” Title లొల్లి వేళ ఆకట్టుకుంటున్న ప్రొఫెసర్ దంటు కనకదుర్గ విశ్లేషణ

police.1

Sadashivanagar Police | రహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో..

ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రంజిత్, హోంగార్డు వేణు వెంటనే స్పందించి రహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అదే సమయంలో బస్సు వెనుక వేగంగా వస్తున్న కారును సకాలంలో ఆపడంతో ప్రమాదం నివారించగలిగారు.

ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులతో పాటు కారులో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదాన్ని సమయానికి అడ్డుకున్న సదాశివనగర్ పోలీసుల సేవలను స్థానికులు అభినందించారు.

ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. ప్రయాణానికి ముందు వాహనాల టైర్లు, బ్రేకులు తదితర సాంకేతిక అంశాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పోలీసులు వాహనదారులకు సూచించారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *