అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Revanth Reddy Leadership | రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి (CM Revanth reddy) సరైన నాయకుడని మాజీ మేయర్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) పేర్కొన్నారు. ఈ మేరకు Nizamabad నగరంలోని ప్రగతినగర్ మున్నూరుకాపు సంఘంలో విలేకరులతో మాట్లాడారు.
Revanth Reddy Leadership | రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసింది..
రాష్ట్రాన్ని బీఆర్ఎస్ (BRS) అప్పుల పాలు చేసిందని.. అలాంటి బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని సంజయ్ పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు.
ఇటు సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, అటు బీఆర్ఎస్ చేసిన అప్పులు తీరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ, అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తుందని.. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే అభివృద్ధి ఆలస్యం ఆవుతుందని గుర్తుచేశారు. ఎప్పటికైనా సబ్బండ వర్గాలకు కాంగ్రెస్‌తోనే న్యాయం జరుగుతుందన్నారు.
Revanth Reddy Leadership | ఎలాంటి పదవి లేకున్నా పనిచేస్తున్నా…
రాష్ట్రాన్ని, జిల్లాను ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని, రేవంత్ రెడ్డి హయాంలోనే అది సాధ్యం అవుతుందన్నారు. ఆయనను మించిన నాయకుడు లేడన్నారు.
సీఎం తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం సెలవు తీసుకోకుండా అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. నిజామాబాద్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు.
ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావొస్తుందని, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారన్నారు. కష్టపడి పని చేసిన వారికి పదవులు వస్తాయని, ఇలాంటి పదవులు లేకున్నా తాను ప్రజల కోసం పనిచేస్తున్నానన్నారు.
ఇది కూడా చదవండి: 2036లో భారతదేశం ఒలంపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది