Kavitha Slams KTR | రాజకీయాల్లో శ్రుతి మించుతున్న ట్రోలింగ్.. కేటీఆర్‌పై ‘కవిత’ తీవ్ర విమర్శలు!

"నువ్వు తిట్టిస్తే నేను భయపడను.. నా పోరాటం ఆగేది లేదు" అంటూ ఆమె సవాల్ విసిరారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kavitha Slams KTR | తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న పోరు మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. వ్యక్తిగత దూషణలు, మార్ఫింగ్ వీడియోల సంస్కృతిపై భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకురాలు కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

తోడబుట్టిన చెల్లి అనే కనీస ఇంగితం కూడా మరిచిపోయి, తనపై సోషల్ మీడియాలో కుట్రపూరితంగా దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kavitha Slams KTR | భయపడే ప్రసక్తే లేదు..

తన ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, అడ్డగోలుగా తిట్టిస్తూ సోషల్ మీడియా వేదికగా తనను మానసికంగా వేధించేందుకు ప్రయత్నిస్తున్నారని కవిత ఆరోపించారు. అయితే, ఇలాంటి చౌకబారు విమర్శలకు, బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. “నువ్వు తిట్టిస్తే నేను భయపడను.. నా పోరాటం ఆగేది లేదు” అంటూ ఆమె సవాల్ విసిరారు.

Telangana Telugu History | ఆంధ్రుల భాష ‘ఆంధ్రం’… మనది ‘జాన తెలుగు’!: “ఇడుపు కాయితం” Title లొల్లి వేళ ఆకట్టుకుంటున్న ప్రొఫెసర్ దంటు కనకదుర్గ విశ్లేషణ

Kavitha Slams KTR | అక్రమాలపై ప్రశ్నిస్తూనే ఉంటా..

ఈ వ్యక్తిగత దాడుల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని, తన గొంతు నొక్కడమే దీని ప్రధాన ఉద్దేశమని కవిత పేర్కొన్నారు. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌తో ముడిపడి ఉన్న అక్రమ దోపిడీల గురించి తాను భయపడకుండా ప్రశ్నిస్తూనే ఉంటానని, ఎంతటి ఒత్తిడి ఎదురైనా ప్రజా పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు. ఆర్థిక అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే సోషల్ మీడియా ట్రోలర్లను వాడుకుంటున్నారని మండిపడ్డారు.

Pritam Pedro Review | హైటెక్ హ్యాకర్.. పాతకాలపు పోలీస్.. ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న ‘జనరేషన్ గ్యాప్’ : ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ ఎలా ఉందంటే?

Kavitha

Kavitha Slams KTR | సంస్కారం మరచిపోకండి..

రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ, మహిళలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఇటువంటి దాడులు అత్యంత హేయమైనవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

“మీకు కూడా పిల్లలు ఉన్నారు, తల్లి ఉందన్న సంగతి మరిచిపోకండి” అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కనీస సంస్కారం, కుటుంబ విలువలను విస్మరించి రాజకీయాలు చేయడం తగదని ఆమె హితవు పలికారు.

తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ, పార్టీ అంతర్గత సమీకరణాలు మారుతున్న వేళ, కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *