Telangana Telugu History | ఆంధ్రుల భాష ‘ఆంధ్రం’… మనది ‘జాన తెలుగు’!: “ఇడుపు కాయితం” Title లొల్లి వేళ ఆకట్టుకుంటున్న ప్రొఫెసర్ దంటు కనకదుర్గ విశ్లేషణ

ప్రొఫెసర్​ దంటు కనకదుర్గ వ్యాఖ్యలు తెలంగాణవాదులకు మద్దతుగా నిలిచి, నెట్టింట వైరల్​ అవుతున్నాయి. ఆమె మాటలు అందరినీ మళ్లీ చరిత్ర లోతుల్లోకి తీసుకెళ్లాయి. చరిత్రను పరిశోధించేలా చేశాయి. 

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Telugu History | తెలంగాణ అస్తిత్వ పోరాటంలో కేవలం భౌగోళిక, ఆర్థిక అంశాలే కాదు… భాషా, సాంస్కృతిక అస్తిత్వాలు కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషించాయి.

అసలు “తెలుగు” అనే భాషకు, “ఆంధ్ర” ప్రాంతానికి మధ్య ఉన్న చారిత్రక వ్యత్యాసాన్ని, ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు వెనుక దాగున్న ఆర్థిక ప్రయోజనాలను అద్భుతంగా విశ్లేషించారు ప్రముఖ పరిశోధకురాలు ప్రొఫెసర్ దంటు కనకదుర్గ.

ఇడుపు కాయితం సినిమా టైటిల్​పై తెలంగాణ – ఆంధ్రా మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. తెలంగాణ ప్రాంతీయ భాషా గౌరవాన్ని, చారిత్రక సత్యాలను చాటిచెప్పేలా ఆమె పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు నెట్టింట వైరల్​ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Private Education Feudalism | నయా భూస్వామ్య వ్యవస్థగా ప్రైవేట్ విద్యా రంగాలు : ఆచార్య మలిక్​ ఘాటు విమర్శ

akshara today .jpgkanaka d

Telangana Telugu History | ఆంధ్ర వేరు… తెలుగు వేరు!

చరిత్రను, ప్రాచీన పురాణాలను నిశితంగా పరిశీలిస్తే ఆంధ్రులకు, తెలుగుకు అసలు సంబంధమే లేదనేది తిరుగులేని నిజం. మన ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడ చూసినా వారి జాతిని “ఆంధ్ర జాతి” అని, వారి ప్రాంతాన్ని “ఆంధ్ర ప్రాంతం” అని, వారి భాషను “ఆంధ్ర భాష” అని మాత్రమే స్పష్టంగా పేర్కొన్నారు.

చివరకు తెలుగు సాహిత్యానికి ఆదికవులుగా చెప్పుకొనే నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ (కవిత్రయం) కూడా తాము రాసిన మహాభారతాన్ని “మేము ఆంధ్రములోకి వనరించి…” (ఆంధ్ర భాషలోకి అనువదించాం) అని అన్నారే తప్ప, ఎక్కడా ‘తెలుగులోకి’ అని రాయలేదు. దీనిని బట్టే వారిది ఆంధ్ర భాష అని రుజువు అవుతోంది.

ఇది కూడా చదవండి:  IAS Officer Y. Srilaxmi | శిఖరం నుంచి పతనం.. మళ్లీ బాధ్యతల వైపు : వై. శ్రీలక్ష్మి పరిపాలనా ప్రయాణం

Telangana Telugu History | పాల్కురికి సోమనాథుడి అస్తిత్వ ప్రకటన!

తెలంగాణ నేలపై ఉద్భవించిన విప్లవాత్మక కవి, శివకవి పాల్కురికి సోమనాథుడు తాను రాసిన ‘బసవపురాణం’లో ఇక్కడి దేశీయ భాషా ప్రాభవాన్ని చాటిచెప్పారు.

ఆయన గ్రంథాన్ని సంస్కృత భూయిష్టమైన ఆంధ్రంలో కాకుండా, ఇక్కడి సామాన్య ప్రజల భాష అయిన “జాన తెలుగు” (స్వచ్ఛమైన తెలుగు) లో రాశారు.

అంతేకాదు, “నేను ఈ గ్రంథాన్ని అచ్చమైన జాన తెలుగులో రాశాను… ఆంధ్రంలో రాయలేదని దయచేసి దీనిని తిరస్కరించకండి” అని ఆయన నాడే వేడుకున్నారంటే… ఆంధ్ర భాషాధిపత్యం మధ్య మన తెలంగాణ “తెలుగు” తన ఉనికిని చాటుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి:  Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!

Telangana Telugu History | ఉమ్మడి రాష్ట్రం వెనుక అసలు వ్యూహం!

బ్రిటిష్ పాలన నుంచి విడిపోయి 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, అక్కడి పాలకులు ముందువెనుక ఆలోచించకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఏకంగా రూ. 12.5 కోట్లు (నాటి కాలంలో ఇది చాలా భారీ మొత్తం) అప్పు చేసి, ఆ భారాన్ని మోయలేక ఆర్థికంగా చతికిలపడ్డారు. తీవ్రమైన దివాలా తీసే పరిస్థితిని ఎదుర్కొన్నారు.

ఆ ఘోరమైన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి, అప్పటికే మిగులు బడ్జెట్‌తో, సుసంపన్నమైన వనరులతో ఉన్న హైదరాబాద్ స్టేట్ (తెలంగాణ) వైపు వారు కన్నేశారు.

అందుకోసమే, అంతవరకు తాము ‘ఆంధ్రులం’ అని చెప్పుకొన్నవారంతా… రెండు రాష్ట్రాలను కలపడం కోసం అకస్మాత్తుగా “మనమంతా ఒకటే… మనది తెలుగు భాష” అనే సరికొత్త సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చారు.

ఇది కూడా చదవండి:  Phule Ambedkar Ideology | మేధో సంపత్తి గులాంగిరి ఇంకెన్నాళ్లు..? బ్లూ ప్రింట్​ ఇదిగో.. రండి.. బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుందాం!

Telangana Telugu History | రాజకీయ ఆయుధంగా

భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట తెలంగాణ వనరులను, సంపదను హస్తగతం చేసుకోవడానికే నాడు ‘తెలుగు’ అనే పదాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్నారనేది ప్రొఫెసర్ దంటు కనకదుర్గ మాటల్లో స్పష్టమవుతోంది.

పురాణాల కాలం నుంచి ఇక్కడి మట్టిలో పురివిప్పిన అసలైన భాష “తెలుగు” (జాన తెలుగు) తెలంగాణదేనని, చారిత్రక ఆధారాలతో సహా ఈ కథనం తెలంగాణ అస్తిత్వాన్ని మరింత బలంగా చాటిచెబుతోంది.

ఇది కూడా చదవండి:  Hyderabad Rain Traffic | ఫ్యూచర్​ సిటీ వెంపర్లాట.. ఉన్న సిటీ ఊగిసలాట.. చిన్న వర్షానికే ట్రాఫిక్ నరకం!.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు దెబ్బతీస్తున్న మౌలిక వసతుల వైఫల్యాలు

Idupu Kayitham Title

Telangana Telugu History | అసలు ఏమిటీ ఇడుపు కాయితం లొల్లి..?

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా వస్తున్న ‘ఇడుపు కాయితం’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇది కాస్తా ‘ఆంధ్రా వర్సెస్ తెలంగాణ’ ప్రాంతీయ వివాదంగా మారిపోయింది.

భార్యాభర్తలు ఇష్టపూర్వకంగా విడిపోయేటప్పుడు పంచాయితీ సమక్షంలో రాసుకునే పత్రాన్ని (Divorce/Separation Document) స్థానిక భాషలో ‘ఇడుపు కాయితం’ లేదా ‘విడుపు పత్రం’ అంటారు. ‘విడవడం’ (వదిలేయడం) అనే క్రియా పదం నుంచే ‘ఇడుపు’ అనే పదం పుట్టింది.

కోర్టులు, చట్టాలు రాకముందు ఊరి పెద్దల సమక్షంలో రాసుకునే ఈ కాగితానికి గ్రామీణ సమాజంలో చట్టబద్ధమైన హోదా ఉండేది. ఇది కేవలం ఒక పదం కాదు, ఒక సామాజిక పరిణామ క్రమానికి అద్దం పట్టే సజీవ సాక్ష్యం.

ఇది కూడా చదవండి:  Telangana Education Budget | కుర్చీలు మారినా.. క్లాస్​రూం తలరాత మారలే: బడ్జెట్​లో విద్యకు​ కేటాయింపులపై ప్రొఫెసర్ ఎంఏ​ మాలిక్​ విమర్శ

Telangana Telugu History | ఆంధ్రా నెటిజన్ల సెటైర్లు..

తెలంగాణ పల్లెటూరి మాండలికంలో ఉన్న ఈ ‘ఇడుపు కాయితం’ (విడాకుల పత్రం) అనే పదం చాలా మంది ఆంధ్రా వాసులకు కొత్తగా అనిపించింది.

దీంతో కొందరు ఆంధ్రా నెటిజన్లు ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా… “ఈ సినిమాను ఆంధ్రా తెలుగులోకి డబ్బింగ్ చేస్తారా?”, “మాకు థియేటర్లలో సబ్‌టైటిల్స్ వేయండి ప్లీజ్” అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెట్టారు. ఇది తెలంగాణ నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

ఇది కూడా చదవండి:  IAS Gandham Chandrudu Story | రూ.ఐదు ‘లంచం’.. ఎండిన డొక్క.. ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడి ‘సర్టిఫికెట్ కథ’!

Telangana Telugu History | తెలంగాణ నెటిజన్ల మండిపాటు

ఆంధ్రులు సంధించిన ఈ సెటైర్లపై తెలంగాణ నెటిజన్లు, సినీ ప్రముఖులు (నటుడు రాహుల్ రామకృష్ణ, గంటా చక్రపాణి వంటి వారు) బలంగా స్పందించారు.

“దశాబ్దాలుగా సినిమాల్లో కోస్తా ఆంధ్రా యాస, రాయలసీమ మాండలికాలు, గోదావరి పదాలు వందల సంఖ్యలో వాడినప్పుడు మేమెప్పుడూ మాకు అర్థం కాలేదని డబ్బింగ్ అడగలేదు కదా?” అని ప్రశ్నించారు.

ఒక తెలంగాణ పదం రాగానే దాన్ని ‘అసలు తెలుగు భాషేనా?’ అన్నట్టుగా ఎగతాళి చేయడం తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని కించపరచడమేనని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి:  Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!

Telangana Telugu History | తమిళులు బెటర్​

తెలుగు భాషను వృద్ధి చేయడం అంటే డిక్షనరీలు తిరగేసి కొత్త పదాలను కనిపెట్టడం కాదు; కాలగర్భంలో కలిసిపోతున్న మన మట్టి పదాలను, ఉన్న సంపదను కాపాడుకోవడం.

తమిళ ఇండస్ట్రీని చూస్తే ఈ విషయంలో ముచ్చటేస్తుంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకైనా అచ్చతమిళ పదాన్నే టైటిల్‌గా పెడతారు, దాన్ని గర్వంగా ఓన్ చేసుకుంటారు.

మరి మన దగ్గరకు వచ్చేసరికి ఒక దర్శకుడో, రచయితకో ధైర్యం చేసి ఒక ప్రాంతీయ అచ్చతెలుగు పదాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తే… దాన్ని ‘భాషా ద్రోహం’ అన్నట్టుగా చూడటం ఎంతవరకు సమంజసం?

ఈ క్రమంలోనే ప్రొఫెసర్​ దంటు కనకదుర్గ వ్యాఖ్యలు తెలంగాణవాదులకు మద్దతుగా నిలిచి, నెట్టింట వైరల్​ అవుతున్నాయి. ఆమె మాటలు అందరినీ మళ్లీ చరిత్ర లోతుల్లోకి తీసుకెళ్లాయి. చరిత్రను పరిశోధించేలా చేశాయి.

ఇది కూడా చదవండి:  Albino Hog Deer’ shines in Kaziranga | అస్సాం అడవుల్లో ప్రకృతి అద్భుతం: కజిరంగాలో మెరిసిన మాయ లేడి ‘అల్బినో హాగ్ డీర్’!

akshara today .jpgtelangan

Telangana Telugu History | మరో ఉద్యమం తప్పదా..?

ఏది ఏమైనా.. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్​ ఆంధ్రప్రదేశ్​కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఆది నుంచి ఉన్నాయి. దీనికితోడు హైదరాబాద్​లో ఇటీవల దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఆంధ్రా నాయకులు తెలంగాణపై మాట్లాడటం, తమ జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​ ప్రకటించడం ద్వారా ఆంధ్రులు తెలంగాణలో తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ఆలోచన చేయడం.. తాజాగా ఇడుపు కాయితం టైటిల్​ లొల్లి, ఇదే నేపథ్యంలో ప్రొఫెసర్​ దంటు కనకదుర్గ వ్యాఖ్యలు వైరల్​ కావడాన్ని పరిశీలిస్తే.. తెలంగాణలో మరో (భాష, రాజకీయ) ఉద్యమం తప్పదా అనే సందేహాలు కలుగుతున్నాయి.

మరి ఈ విశ్లేషణను తెలంగాణ రాజకీయ నేతలు, ఉద్యమకారులు, మేధావులు, తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టాలని భావిస్తున్నవారు ఎంత వరకు అవలోకనం చేసుకుని.. తమ గళాన్ని వినిపిస్తారో వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి:  Varalakshmi Controversial Comments | మగాడు కేవలం ‘స్పేర్ పార్ట్’ మాత్రమేనా?.. నెట్టింట వరలక్ష్మి శరత్ కుమార్ వ్యాఖ్యల దుమారం

ఇది కూడా చదవండి:  BC Leader Targeted | కులాధిపత్య మీడియా ‘కుట్రల’ బట్టబయలు: బీసీ బిడ్డ ఉన్నత పదవిపై ‘రెడ్డి గారి ఛానెల్’ విషప్రచారం!

ఇది కూడా చదవండి:  Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో నివురుగప్పిన నిప్పులా ‘మాఫియా’ వివాదం

ఇది కూడా చదవండి:  Swathi Reddy | పెళ్ళి చేసుకోవడం కన్నా కుక్కను పెంచుకోవడం బెటర్.. నటి SwathiReddy

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *