అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RAPO23 Movie | ‘ఎనర్జిటిక్ స్టార్’ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటిస్తున్న మూవీ ‘RAPO23’. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ రాయడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు. ఇది తన 23వ సినిమా కావడంతో దీనికి ‘RAPO23’ వర్కింగ్ టైటిల్ పెట్టారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఇప్పటికే మూవీ యూనిట్ విడుదల చేసింది. అయితే టైటిల్ మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.
RAPO23 Movie | జూన్ 29న పూజా కార్యక్రమం..
‘RAPO23’కి సంబంధించిన పూజా కార్యక్రమాల అధికారిక ప్రకటనను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు రేపు అంటే జూన్ 29న సోమవారం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి సహా నివేదా పేతురాజ్ నటించనున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.
RAPO23 Movie | సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా..
‘RAPO23’ స్టైలిష్ మరియు మైండ్ బ్లాకింగ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీలో రామ్ ‘వీర’ (Veera) అనే పవర్ఫుల్ క్యారెక్టర్లో ‘లోన్ వోల్ఫ్’ (Lone Wolf) గా కనిపించనున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరక్కెక్కించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి..: Telangana Telugu History | ఆంధ్రుల భాష ‘ఆంధ్రం’… మనది ‘జాన తెలుగు’!: “ఇడుపు కాయితం” Title లొల్లి వేళ ఆకట్టుకుంటున్న ప్రొఫెసర్ దంటు కనకదుర్గ విశ్లేషణ