Swayambhu Poster Release | నిఖిల్ బర్త్‌డే స్పెషల్.. ‘స్వయంభూ’ నుంచి పోస్టర్​ రిలీజ్​

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Swayambhu Poster Release | నిఖిల్ (Nikhil) హీరోగా నటిస్తున్న స్వయంభూ చిత్రం నుంచి పోస్టర్​ రిలీజ్​ అయింది. నిఖిల్​ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్​ హీరో లుక్​తో ఉన్న పోస్టర్​ను విడుదల చేశారు.

Swayambhu Poster Release

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. పాన్​ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ పిరియాడిక్​ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో నిఖిల్ పక్కన హీరోయిన్లుగా సంయుక్త మీనన్, నభా నటేశ్ నటిస్తున్నారు. సోమవారం నిఖిల్​ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్​ హీరో లుక్​తో ఉన్న పోస్టర్​ను విడుదల చేసింది. అంతేకాదు, ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు నిఖిల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన Birthday Special Video కూడా విడుదల కానుంది.

Swayambhu Poster Release | భారీ అంచనాలు

Swayambhu Poster Release

స్వయంభూ చిత్రాన్ని (Swayambhu Movie) భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో విడుదల చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ మూవీ నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోంది. కార్తికేయా, కార్తికేయా–2 సినిమాలతో నిఖిల్​కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా కార్తికేయా–2 హిందీలో భారీగా వసూళ్లు రాబట్టింది. దీంతో నిఖిల్​ ఇమేజ్​ పెరగడంతో తాజాగా స్వయంభూ సైతం భారీ హిట్​ కొడుతుందని మేకర్స్​ భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Naga Chaitanya | స‌మంత‌తో రిలేష‌న్ షిప్‌పై అస‌త్య ప్ర‌చారాలు.. ఢిల్లీ హైకోర్టుని ఆశ్ర‌యించిన నాగ చైత‌న్య‌

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *