Congress Talent Hunt | రాహుల్ గాంధీ ఆలోచనలతో ‘టాలెంట్ హంట్’.. రాజకీయాల్లోకి యువతను ఆహ్వానిస్తున్న కాంగ్రెస్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Congress Talent Hunt | రాజకీయాల్లో రాణించాలనుకునే ప్రతిభావంతులైన యువతీ యువకులకు కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన వేదికను కల్పిస్తోందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ప్రకటించారు. సోమవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనల మార్గంలో సరికొత్తగా రూపొందించిన ‘టాలెంట్ హంట్’ కార్యక్రమం వివరాలను పంచుకున్నారు. పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధుల నియామక ప్రక్రియలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో యువశక్తి పాత్ర ఎంతో కీలకమని భావించిన రాహుల్ గాంధీ.. పార్టీలకు అతీతంగా, కేవలం నైపుణ్యం, సమాజ సేవపై ఆసక్తి ఉన్న యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని తెచ్చారని వెల్లడించారు.
pcc.1

Congress Talent Hunt | టాలెంట్, లౌకికవాదమే ఎంపికకు ప్రామాణికం..

ఈ టాలెంట్ హంట్ ద్వారా అధికార ప్రతినిధులను ఎలా ఎంపిక చేయబోతున్నారో మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిణామాలపై స్పష్టమైన అవగాహన ఉండటంతో పాటు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన సిద్ధాంతమైన ‘లౌకికవాదం’పై గట్టి నమ్మకం, పట్టు ఉన్న వ్యక్తులను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. రాజకీయ నేపథ్యం లేకపోయినా, సమాజానికి మంచి చేయాలనే దృక్పథం, సమర్థత ఉన్నవారికి ఇదొక చక్కని అవకాశమని తెలిపారు. ఎలాంటి రాజకీయ సిఫార్సులు లేకుండా, కేవలం అభ్యర్థుల ప్రతిభను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియ సాగుతుందని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.

pcc.2

ఇది కూడా చదవండి: Supreme Court Judges | సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీలు.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *