Armoor Theft Case | బాబాయి ఇంట్లో చోరీ చేయించిన వ్యక్తి.. ముగ్గురి అరెస్ట్

Balla Sandeep Kumar

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Armoor Theft Case | ఆర్మూర్​ దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. వారి నుంచి రూ.31.48 లక్షల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు.

ఆర్మూర్​ పట్టణంలో మే 24న చోరీ జరిగింది. ఈ కేసులో రూ.41,31,500 విలువైన బంగారం, వెండి, నగదు చోరీ అయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం 9 గంటలకు, ఆర్మూర్ నగరంలోని బ్రాహ్మణపల్లి (Brahmanapalli) క్రాస్ రోడ్డు వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని విచారించగా చోరీ చేసిన వ్యక్తులుగా తేలింది.

Armoor Theft Case | వేములవాడ వెళ్లగానే..

Armoor Theft Case

ఆర్మూర్ నగరానికి చెందిన విజయ్ అగర్వాల్ అనే వ్యక్తి తన బాబాయ్ ఇంట్లో దొంగతనం చేయడానికి ఒక పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం మరో ముగ్గురితో బేరం కుదుర్చుకున్నాడు. ఆర్మూర్ నగరంలోని మహాలక్ష్మి కాలనీలో గల తన బాబాయ్ కుటుంబ సభ్యులు అందరూ వేములవాడ వెళ్లగా వారి ఇంట్లో సల్మాన్ ద్వారా విలువైన బంగారం వెండి నగదును దొంగతనం చేయించాడు. నిందుతులు విజయ్​ అగర్వాల్, హైదరాబాద్ నగరంలోని బంజరాహిల్స్​కు చెందిన సల్మాన్ ఖాన్, బంజరాహిల్స్​కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి మంజల్ సాయి కుమార్​లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరో నిందితుడు శ్రీహరి పరారీలో ఉన్నారని వెల్లడించారు.

Armoor Theft Case | స్వాధీనం చేసుకున్న సొత్తు

Armoor Theft Case

నిందితుల నుంచి పోలీసులు 590 గ్రాముల బంగారం, రెండు వెండి లక్ష్మి బిళ్లలు 300 గ్రాములు, వెండి ప్లేట్, రూ.19,33,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొత్తును తీసుకోవడానికి నిందితులు ఆర్మూర్​లోని బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్డు వద్దకు రాగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ తెలిపారు. చోరీ చేసిన సొమ్ములో సల్మాన్ తన అవసరాలకు రూ. లక్ష వాడుకోగా, మంజల్ సాయి కుమార్ రూ.83,500 వాడుకున్నాడు. పరారీలో ఉన్న శ్రీహరి రూ.8 లక్షలు ఉన్నాయని సీపీ తెలిపారు. విజయ్ అగర్వాల్ గతంలో పలు కేసులలో నిందితుడిగా ఉండటంతో అతనిపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ తెరిచారు. కేసును ఛేదించడంలో ఏసీపీ ఆర్మూర్ జె. వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ, సాయినాథ్​, అమరేందర్, కిరణ్ కుమార్, సతీష్, అశోక్, అన్వేష్​లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.

ఇది కూడా చదవండి..: Velpur VDC | సాంఘిక బహిష్కరణ చేశారని గంగపుత్రుల ఆవేదన.. వీడీసీపై కలెక్టర్​కు ఫిర్యాదు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *