అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump Avenue | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన పేరుతో హైదరాబాద్ నగరంలో రోడ్డును ఏర్పాటు చేయడం అపూర్వ గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌కు ఆనుకుని ఉన్న రోడ్డుకు “డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ” అని ఇటీవల పేరు పెట్టిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోడ్డును ప్రారంభించారు. దీంతో ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దీనిని “అపూర్వ గౌరవం”గా అభివర్ణించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన చిత్రాన్ని పంచుకున్నారు. భారతదేశంలోని హైదరాబాద్‌లో కొత్త ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ ఈ విధంగా గౌరవించబడిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు నేనే. ధన్యవాదాలు అని ట్రంప్ పేర్కొన్నారు.
Donald Trump Avenue | పెట్టుబడులను ఆకర్షించడానికి..

తెలంగాణ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి పలు రోడ్ల పేర్లను మారుస్తామని గతంలో ప్రకటించింది. గూగుల్, ఫేస్బుక్ పేరిట సైతం రోడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇందులో భాగంగా యూఎస్ కాన్సులేట్ పక్కన, అమెరికన్ టెక్ సంస్థల కార్యాలయాలకు సమీపంలో ఉన్న రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టింది. ఇటీవలఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారత్‌లో యూఎస్ రాయబారి సెర్గియో గోర్లు లాంఛనప్రాయ రోడ్డు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఇది కూడా చదవండి..: Beijing Plane Crash | బీజింగ్‌లో కలకలం.. అత్యంత ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన చిన్న విమానం!