Beijing Plane Crash | బీజింగ్‌లో కలకలం.. అత్యంత ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన చిన్న విమానం!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Beijing Plane Crash | చైనా రాజధాని బీజింగ్‌లో శుక్రవారం సాయంత్రం సంచలన ఘటన చోటుచేసుకుంది. కారు పరిమాణంలో ఉన్న ఓ చిన్న విమానం (ఎయిర్‌క్రాఫ్ట్) నగరంలోని అత్యంత ఎత్తైన భవనం సిటిక్ టవర్ (చైనా జున్) ను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై చైనా అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

108 అంతస్తులతో బీజింగ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న సిటిక్ టవర్, ప్రభుత్వ రంగ సంస్థ సిటిక్ గ్రూప్ ప్రధాన కార్యాలయంగా ఉంది. ప్రమాదం అనంతరం భవనం చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని రాకపోకలను నిలిపివేశారు. భారీ సంఖ్యలో పోలీసు వాహనాలు, అగ్నిమాపక సిబ్బంది అక్కడ మోహరించారు.

Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!

Beijing Plane Crash | భారీ శబ్దంతో భవనాన్ని ఢీకొట్టిన విమానం

ఘటన సమయంలో సమీపంలో ఉన్న ఓ కొరియర్ ఉద్యోగి తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బాణాసంచా పేలుళ్ల కంటే ఎక్కువ శబ్దం వినిపించడంతో అక్కడికి పరుగెత్తి వెళ్లాడు.

అక్కడ చిన్న విమానం భవనంలో ఇరుక్కుపోయినట్లు చూశానని తెలిపాడు. ఘటనకు సంబంధించిన వీడియోను తాను చిత్రీకరించినప్పటికీ, పోలీసులు పట్టుకుంటారనే భయంతో తర్వాత డిలీట్ చేసినట్లు వెల్లడించాడు.

Venezuela earthquake | కన్నీటి సముద్రమైన వెనిజులా: శిథిలాల కింద ప్రాణాల వేట.. 235కి చేరిన మృతుల సంఖ్య 

Beijing Plane Crash | పోలీసుల ఆదేశాల కీలక ఆదేశాలు

ఘటన స్థలంలో ఉన్న పలువురు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. పోలీసులు ఫొటోలు, వీడియోలు తీయకుండా అడ్డుకోవడమే కాకుండా, ఇప్పటికే తీసిన చిత్రాలను కూడా తొలగించాలని సూచించినట్లు తెలిపారు.

సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన పోస్టులు కూడా కొద్ది సేపటికే కనిపించకుండా పోయాయి. చైనాలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘షియాహోంగ్‌షు’లో సిటిక్ టవర్‌కు సంబంధించిన తాజా పోస్టులు తొలగించబడినట్లు సమాచారం.

Beijing Plane Crash | రోడ్డుపై నీలి టార్పాలిన్‌తో కప్పి..

సమీపంలోని మరో కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ మాట్లాడుతూ.. భవనం పక్కనే రోడ్డుపై వోక్స్‌వ్యాగన్ బీటిల్ కారు పరిమాణంలో ఉన్న వస్తువును నీలి రంగు టార్పాలిన్‌తో కప్పి ఉంచినట్లు తన కార్యాలయం నుంచి చూశానని తెలిపింది. అక్కడ అంబులెన్సులు, పోలీసు వాహనాలు భారీగా ఉన్నాయని చెప్పుకొచ్చింది.

School Kitchen Shed | బడి రుణం.. తమ్ముడి స్మరణం: సిరికొండ జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థి అక్షరార్చన!

Beijing Plane Crash | ప్రమాదమా? లేక ఉద్దేశపూర్వక చర్యా?

ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. బీజింగ్ నగర కేంద్ర ప్రాంతంలో గగనతల రాకపోకలపై కఠిన ఆంక్షలు ఉండటంతో, ఆ ప్రాంతంలో చిన్న విమానం ఎలా ప్రవేశించిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే ఈ ఘటనపై చైనా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ఈ సంఘటనపై అనేక సందేహాలు నెలకొన్నాయి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *