అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రష్యా ఆంక్షల బిల్లుపై సంతకం చేశారు. దీంతో అది చట్టరూపం దాల్చింది. ఫలితంగా రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించేందుకు ట్రంప్‌కు మార్గం సుగుమమైంది.
రిపబ్లికన్ల ఆధ్వర్యంలోని ప్రతినిధుల సభ ఈ ఆంక్షల బిల్లును 262-159 ఓట్ల తేడాతో ఆమోదించిన ఆమోదించింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి ఆర్థిక వనరులను తగ్గించడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చారు. రష్యా చమురు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు విధించే అధికారాన్ని ఈ చట్టం ట్రంప్‌కు కల్పించింది.
Trump Tariffs | 500 శాతం టారిఫ్‌లు
ఈ చట్టం రష్యా వస్తువులపై 500 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తుంది. రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు నిబంధనల పరిధిలోకి వచ్చే దేశాల వస్తువులపై 100 శాతం వరకు సుంకాలను విధిస్తుంది. ప్రస్తుతం రష్యా నుంచి చైనాతో పాటు భారత్ పెద్ద ఎత్తున ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ రెండు దేశాలపై ట్రంప్ 100 శాతం సుంకాలు విధించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. వీటితోపాటు యూఏఈ, టర్కీ, సింగపూర్, అజర్బైజాన్, కజకిస్తాన్, హంగేరి, కిర్గిజ్‌స్థాన్ మరియు స్లోవేకియా అనే 10 దేశాలను స్పష్టంగా పేర్కొనాలని కోరారు. అయితే ఈ చట్టం నేరుగా వంద శాతం సుంకాన్ని విధించదు. ట్రంప్ తన అధికారాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకుంటే సుంకాలు విధించవచ్చు. కాగా ఇప్పటికే అమెరికా భారత్‌పై 10 శాతం టారిఫ్‌లు విధిస్తోంది.
ఇది కూడా చదవండి..: Pakistan Mosque Blast | పాకిస్తాన్లో ఘోర బాంబు దాడి..మసీదులో ఆత్మాహుతి పేలుడు..15 మంది దుర్మరణం..56 మందికి తీవ్ర గాయాలు!