Chilakaluripet Fire Accident | క్రాకర్స్​ షాపులో మంటలు.. యజమాని మృతి

ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chilakaluripet Fire Accident | ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ క్రాకర్స్​ దుకాణంలో మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు.

చిలకలూరిపేట (Chilakaluripet)లోని కేఎస్​ఎస్​ఆర్​ క్రాకర్స్ షాపులో శుక్రవారం రాత్రి మంటలు అంటుకున్నాయి. దీంతో యజమాని భూమ సురేష్​ భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే అప్పటికే ఆయనకు మంటలు అంటుకోవడంతో తీవ్ర గాయాలతో చనిపోయాడు. పలువురు సిబ్బంది సైతం ప్రమాదంలో గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానిక చేరుకొని మంటలను ఆర్పి వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Chilakaluripet Fire Accident | బాణసంచ కాల్చడంతో..

దుకాణం ముందు బాణసంచ కాల్చడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు అగ్ని మాపక శాఖ అధికారులు తెలిపారు. చిచ్చుబుడ్డి లాంటి దానిని కాల్చడంతో.. నిప్పు రవ్వలు దుకాణంలో పడి ప్రమాదం జరిగింది. ఈ దుకాణానికి సరైన అనుమతి లేదని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా చాలా టపాసుల దుకాణాల్లో సరైన నిబంధనలు పాటించడం లేదు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి..: TTD Ghee ED Probe | టీటీడీ ప్రసాదం వివాదంలో సంచలన మలుపు: నెయ్యిలో జంతు కొవ్వు లేదన్న ఈడీ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *