TTD Ghee ED Probe | టీటీడీ ప్రసాదం వివాదంలో సంచలన మలుపు: నెయ్యిలో జంతు కొవ్వు లేదన్న ఈడీ!

నిజానిజాలు సరిగ్గా తెలుసుకోకుండా జంతు కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆధ్యాత్మికవేత్తలు, సాధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: TTD Ghee ED Probe | తిరుమల Tirumala శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై సుదీర్ఘంగా సాగుతున్న దర్యాప్తులో అత్యంత కీలకమైన, సంచలన పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ (TTD) నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు (Animal Fat) కలవలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) స్పష్టం చేసింది.

TTD Ghee ED Probe | సీబీఐ సిట్, ఈడీ విచారణలో తేలిందిదే!

కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఆధ్వర్యంలోని ప్రత్యేక విచారణ బృందం (SIT), ఈడీ నిర్వహించిన లోతైన దర్యాప్తులో శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వును కలిపినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టమైంది.

Danam Nagender Disqualification | ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయిందంటూ స్పీకర్​కు ఆర్డర్​ కాపీ పంపిన హైకోర్టు!

అయితే, ఈడీ దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. సరఫరా చేసిన నెయ్యిలో ప్రమాదకర రసాయనాలు (Chemicals), వృక్ష ఆధారిత పదార్థాల (Vegetable Oils/Fats) ద్వారా కల్తీకి పాల్పడినట్లు అధికారులు ఆధారాలతో సహా నిర్ధారించారు.

TTD Ghee ED Probe | భక్తుల మనోభావాలతో ఆటలాడారని ఆగ్రహం!

కాగా, శ్రీవారి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ గత కొన్ని రోజులుగా జరిగిన ప్రచారంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానిజాలు సరిగ్గా తెలుసుకోకుండా జంతు కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆధ్యాత్మికవేత్తలు, సాధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, నెయ్యి కల్తీకి పాల్పడి భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించిన నిందితులు, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి చట్టపరమైన ప్రక్రియను ఈడీ, సిట్ మరింత వేగవంతం చేశాయని సమాచారం.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *