అక్షరటుడే, వెబ్‌డెస్క్: Danam Nagender Disqualification | తెలంగాణ Telangana రాజకీయాల్లో తీవ్ర మునుపెన్నడూ లేని విధంగా ఊహించని సంచలనం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పుకు సంబంధించిన 91 పేజీల సుదీర్ఘ ఆర్డర్ కాపీని హైకోర్టు అధికారికంగా విడుదల చేసింది.
Danam Nagender Disqualification | ఈసీ, స్పీకర్‌లకు ఆర్డర్ కాపీల రవాణా!
హైకోర్టు తీర్పు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘం (ECI)తో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు న్యాయస్థానం పంపించింది. దానం నాగేందర్ సభ్యత్వం రద్దయిన దృష్ట్యా.. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఖాళీ అయినట్లు హైకోర్టు తన తీర్పు కాపీ ద్వారా శాసనసభాధిపతికి, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు స్పష్టంగా తెలియజేసింది.
Danam Nagender Disqualification | పార్టీ మార్పిడి ముప్పు.. తక్షణ చర్యలు
బీఆర్ఎస్ (BRS) గుర్తుపై పోటీ చేసి గెలిచిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల చోటుచేసుకున్న ఈ ఫిరాయింపుల వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
Danam Nagender | సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదు.. దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ వర్గాల్లో ఈ వార్త తీవ్ర ఉత్కంఠను, రాజకీయ వేడిని రాజేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ తీర్పుపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.
కాగా, హైకోర్టు (High Court) తీర్పుపై దానం నాగేందర్ ఇప్పటికే స్పందించారు. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు (Supreme Court)కు వెళ్లే ఆలోచన లేదని పేర్కొన్నారు.