అక్షరటుడే, వెబ్డెస్క్ : Danam Nagender | హైకోర్టు (High Court) తీర్పుపై దానం నాగేందర్ స్పందించారు. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు (Supreme Court)కు వెళ్లే ఆలోచన లేదని పేర్కొన్నారు.
దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ.. ఖైరతాబాద్ సీటు ఖాళీ అయినట్లు ప్రకటించింది. దీనిపై దానం మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు వస్తే పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. యుద్ధం తనకేం కొత్త కాదని చెప్పారు. మళ్లీ పోరాడుతా.. మళ్లీ గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు.
Danam Nagender | ఉప ఎన్నిక తప్పదా..
దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ (BRS) నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. అంతేగాకుండా ఆ పార్టీ సీటుపై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనతో పాటు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన స్పీకర్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని పిటిషన్లను కొట్టివేశారు. మిగతా వారు సాంకేతిక కారణాలతో తప్పించుకన్నా.. దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేయడంతో బీఆర్ఎస్, బీజేపీ ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో సుదీర్ఘ విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయనపై వేటు వేసింది. తాను సుప్రీంకోర్టుకు వెళ్లనని దానం ప్రకటించడంతో.. త్వరలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.
ఈ వీడియో చూడండి :
దానంపై వేటు.. బీఆర్ఎస్లో జోష్..#brs #telanganapolitics #disqualification #aksharatoday pic.twitter.com/DPIUFoz5wQ
— Akshara Today | Telugu News (@AksharaToday) September 18, 2026
దీనిని కూడా చదవండి : Harish Rao Danam Nagender | దానంపై అనర్హత వేటు.. కాంగ్రెస్ తీరుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు