BJP Padayatra | రేపు బీజేపీ పాదయాత్ర.. హైదరాబాద్​లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్​ నగరంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దీంతో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP Padayatra | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోమంత్రి అమిత్​ షా (Amit Shah) ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పాదయాత్ర మార్గంలో రేపు ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.

పాలన మార్పు పేరిట కాంగ్రెస్​ చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర చేపడుతున్నారు. దేశభక్తులందరం ఈ యాత్రకు తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు కోరారు. నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్​రామ్ విగ్రహం నుంచి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుంది. మొజంజాహి ఎక్స్​రోడ్డు వరకు సాగుతోంది. అమిత్​ షా రానుండటంతో ఈ పాదయాత్ర పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు తరలిరానున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్​ పోలీసులు చర్యలు చేపట్టారు.

BJP Padayatra | ఆ మార్గాల్లో ప్రయాణాలు వద్దు

బీజేపీ పాదయాత్ర (BJP Padayatra) నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. లిబర్టీ, రవీంద్ర భారతి, AR పెట్రోల్ పంప్, బషీర్‌బాగ్, BJR విగ్రహం, SBI గన్‌ఫౌండ్రీ, GPO, నాంపల్లి T-జంక్షన్, తాజ్ ఐలాండ్, MJ మార్కెట్, అఫ్జల్‌గంజ్, జంబాగ్ మార్గాల్లో రద్దీ అధికంగా ఉంటుందని, వాహనదారులు ఆ మార్గాల్లో వెళ్లొద్దని సూచించారు.

ర్యాలీ నేపథ్యంలో PTI – రవీంద్ర భారతి, కర్బలా జంక్షన్ – రవీంద్ర భారతి, కట్ట మైసమ్మ – చిక్కడపల్లి, నారాయణగూడ – లిబర్టీ, సెమెట్రీ జంక్షన్ – హెచ్​టీపీ, బషీర్‌బాగ్ – బ్యాంక్ స్ట్రీట్, రామ్ కోటి – అబిడ్స్, పాత అంబేద్కర్ విగ్రహం – DMHS, చాదర్‌ఘాట్ – MJ మార్కెట్, అఫ్జల్‌గంజ్ – MJ మార్కెట్, గోకుల్ నగర్ – నాంపల్లి, రసూల్‌పురా – రాణిగంజ్, పంజాగుట్ట – సెక్రటేరియట్ మార్గాలపై ప్రభావం ఉంటుందన్నారు. ఆర్టీసీ బస్సులను సైతం దారి మళ్లించనున్నట్లు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Country Bomb Blast | బాన్సువాడలో కలకలం.. నాటు బాంబు పేలి ఆరుగురికి గాయాలు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *