Drinking Water Waste | తాగునీరు వృథా.. రూ.10 వేలు ఫైన్​ వేసిన అధికారులు

హైదరాబాద్​లో తాగునీరు వృథా చేసిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10 వేల జరిమానా వేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drinking Water Waste | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో తాగునీరు కోసం చాలా మంది అనేక కష్టాలు పడుతుంటారు. చాలా బస్తీలకు సరిపడా నీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొందరు మాత్రం జలమండలి (HMWS SB) సరఫరా చేసే తాగునీటి వృథా చేస్తుంటారు. ఆ నీటితో కార్లు కడగడం, ఇతర పనులు చేస్తుంటారు. ఇలా నీటిని వృథా చేసే వారిపై జలమండలి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన బంజారా హిల్స్​లో మంగళవారం జరిగింది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఖైరతాబాద్ పరిధిలో సీవరేజే సమస్యలపై క్షేత్ర స్థాయిలో సందర్శించారు.. ఆ సమయంలోనే ఆనంద్ నగర్ కాలనీలో ఓ ఇంటిలో సంప్/ఓవర్‌హెడ్ ట్యాంక్ ఓవర్‌ఫ్లో కారణంగా తాగునీరు వృథా అవుతున్నట్లు గమనించారు.

Drinking Water Waste | ఎండీ ఆగ్రహం

తాగునీటిని వృథా చేయడంపై ఎండీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని హెచ్చరించారు. అంతే కాకుండా వారికి నోటీసు అందించి, జరిమానా వెయ్యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి రూ.10 వేల జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Drinking Water Waste | మురుగు నిల్వకుండా చర్యలు

ఖైరతాబాద్ (Khairatabad) సర్కిల్ పరిధిలోని నవీన్ నగర్ కాలనీ, ఆనంద్‌నగర్ ప్రాంతాల్లో నెలకొన్న సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్యలపై జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి పరిశీలించారు. రోడ్లపై నిలిచిపోతున్న మురుగు నీటి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఎండీ, సంబంధిత అధికారులతో కలిసి సమస్యలపై సమీక్ష నిర్వహించారు. సీవరేజి లైన్ లలో పేరుకుపోయిన పూడిక కారణంగా పలు ప్రాంతాల్లో ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. వెంటనే పూడిక తొలగించాలని ఆదేశించారు.

 

దీనిని కూడా చదవండి : Urea Supply | రైతు వేదికల్లో యూరియా పంపిణీ చేయాలి : సీఎం రేవంత్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *