HYDRAA Lakes | చెరువులు సిద్ధం చేయాలి : హైడ్రా క‌మిష‌న‌ర్‌

త‌మ్మిడికుంట‌, సున్నం చెరువు అభివృద్ధి ప‌నుల‌ను ఆగ‌స్టు 3వ వారానికి పూర్తి చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆదేశించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA Lakes | మాదాపూర్‌ (Madhapur), ఐటీ కారిడార్‌లోని త‌మ్మిడికుంట‌, సున్నం చెరువు అభివృద్ధి ప‌నుల‌ను ఆగ‌స్టు నెల 3వ వారానికి పూర్తి చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ (Ranganath) ఆదేశించారు. వ‌ర్షం నీరు నేరుగా చెరువులోకి చేరేలా ఇన్‌లెట్ల‌ను అభివృద్ధి చేయాల‌ని సూచించారు.

చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ బుధ‌వారం ప‌రిశీలించారు. వ‌ర‌ద క‌ట్ట‌డి, భూగ‌ర్భ జ‌లాల వృద్ధితో పాటు.. ఒక చెరువు వ‌ల్ల స‌మ‌కూరే ప్ర‌యోజ‌నాల‌న్నీ ప్ర‌జ‌ల‌కు తెలిసి వ‌చ్చేలా చెరువుల‌ను అభివృద్ధి చేయాల‌న్నారు. క‌బ్జాల‌కు గురై 16.4 ఎక‌రాల‌కు ప‌రిమిత‌మైన సున్నంచెరువును ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి 30.5 ఎక‌రాల‌కు హైడ్రా విస్తరించింది. త‌మ్మిడికుంట కూడా 16.2 ఎక‌రాల‌కు ప‌రిమిత‌మ‌వ్వ‌గా.. 29.3 ఎక‌రాల‌కు విస్త‌రించి అభివృద్ధి ప‌నులను చేప‌డుతోంది.

HYDRAA Lakes | ఆహ్లాదం పంచేలా..

చెరువులను అభివృద్ధి చేసిన తర్వాత ప్రజలకు ఆహ్లాదం అందించేలా చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్​ సూచించారు. చెరువుల చుట్టూ బ‌ల‌మైన బండ్ ఏర్పాటుతో పాటు.. చుట్టూ విశాల‌మైన పాత్‌వే నిర్మాణం చేప‌ట్టాల‌న్నారు. పార్కులు, ఓపెన్ జిమ్‌లు, పిల్ల‌లు ఆడుకునేందుకు ప్లే ఏరియాలు ఏర్పాటు చేయాల‌న్నారు. చెరువులోకి వ‌ర‌ద నీరు సుల‌భంగా చేరేలా ఇన్‌లెట్లు, చెరువు నిండిన త‌ర్వాత బ‌య‌ట‌కు వెళ్లేలా ఔట్‌లెట్లు అభివృద్ధి చేయాల‌ని సూచించారు. చెరువులోకి మురుగు నీరు చేర‌కుండా ఎస్‌టీపీలను నిర్మించాలని ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *