అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trainee IPS Remand | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పర్‌పల్లి కోర్టు (Upparpalli Court) 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
హైదరాబాద్ (Hyderabad)లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి మరో ట్రైనీ మహిళా ఐపీఎస్‌ను వేధించినట్లు కేసు నమోదు అయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను లైంగికంగా వేధించడంతో పాటు దాడి చేశాడని, బ్లాక్ మెయిలిక్ పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Trainee IPS Remand | మిర్యాలగూడలో అరెస్ట్
కేసు నమోదు అయిన మరుసటి రోజు ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం పరారీ అయ్యారు. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఆయనను మిర్యాలగూడలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. బుధవారం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
దీనిని కూడా చదవండి : Krishna River Flood | కృష్ణానదికి భారీగా వరద..