RTC Bus Stuck | బురదలో ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం

భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : RTC Bus Stuck | భారీ వర్షాలతో జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. తాజాగా కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కనున్న మట్టిలో కూరుకుపోయిన( Heavy Rains) ఘటన ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది.

RTC Bus Stuck | అడ్లూర్​ రోడ్డుపై  ప్రయాణిస్తుండగా..

కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి బుధవారం గిద్ద గ్రామం మీదుగా పోసానిపేట్, గోకుల్ తండా వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం అడ్లూర్ రోడ్డుపై ప్రయాణిస్తోంది. ఎదురుగా వస్తున్న వాహనాలకు దారి ఇవ్వడానికి డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు తీయడంతో టైర్లు బురదలో ఇరుక్కుపోయాయి. డ్రైవర్ బయటకు తీసే ప్రయత్నంలో బస్సు మరింతగా బురదలోకి దిగి ఒకవైపు ఒరిగింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనపై స్థానికులు, వాహనదారులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు ఇరువైపులా మొరం వేయకపోవడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, వర్షాకాలంలో ఇది ప్రమాదాలకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు ఇరువైపులా మొరం వేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి : Annapurna Studios’ #Pallaburusu Teaser Out Now.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *