అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Nizamabad Traffic Diversions | నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
Nizamabad Traffic Diversions | 24వ తేదీ నుంచి..
నిమజ్జనం సందర్భంగా ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 11గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ఉంటుందని సీపీ తెలియజేశారు. హైదరాబాదు నుండి నిజామాబాద్ వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు మాధవ నగర్ బైపాస్, కంఠేశ్వర్ బైపాస్, రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ గుండా ఆర్టీసీ బస్టాండ్ చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే బోధన్ వెళ్లే, వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు అర్సపల్లి చౌరస్తాలో ఎడమవైపు తిరిగి, బైపాస్ గుండా ప్రయాణిస్తూ కొత్త కలెక్టరేట్, కంఠేశ్వర్ బైపాస్, రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ చౌరస్తా నుండి బస్టాండ్ చేరుకోవాలి. తిరిగి ఇదే దారిలో బోధన్‌కు వెళ్లాలి.
Nizamabad Traffic Diversions | ఆర్మూర్‌కు వెళ్లే వాహనాలు..
ఆర్మూర్ వైపు నుండి నిజామాబాద్ బస్టాండ్, ఇతర ప్రాంతాలకు వచ్చీవెళ్లే వాహనాలు కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తా వరకు చేరుకొని అక్కడి నుండి నేరుగా రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ ‘టీ’ జంక్షన్ వద్ద కుడి వైపుకు తిరిగి, రైల్వే స్టేషన్ ముందరి నుండి బస్టాండ్ చేరుకోవాలి. ఇదే దారిని ఉపయోగిస్తూ ఆర్మూర్ వైపు తిరిగి వెళ్లాలని సూచించారు. బాన్సువాడ, వర్ని వైపు నుంచి వచ్చి వెళ్లే ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు వర్ని చౌరస్తా వరకు చేరుకొని అక్కడి నుండి కుడి వైపుకు తిరిగి ఆర్ఆర్ చౌరస్తా గుండా పులాంగ్ చౌరస్తా, ఎల్లమ్మ గుట్ట చౌరస్తా, కోర్ట్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ ముందర నుండి బస్టాండ్ చేరుకోవాల్సి ఉంటుంది.
Nizamabad Traffic Diversions | భారీ వాహనాలకు అనుమతి లేదు..
భారీ వాహనాలు భారీ వాహనాలు ఎట్టి పరిస్థితిలో 24వ తేదీ ఉదయం 11 గంటల నుండి 26వ తేదీ ఉదయం 11 గంటల వరకు నగరంలో ప్రవేశించరాదని సీపీ తెలిపారు. కంఠేశ్వర్ రైల్వే అండర్ పాస్ ఎత్తు ముఖ్యంగా రైల్వే అండర్ పాస్ యొక్క ఎత్తు రోడ్డు నుండి 13 ఫీట్లు ఉన్నందున, ఇట్టి విషయాన్ని గమనించి ‘13 ఫీట్ల లోపల’ ఉండే గణపతి విగ్రహాలు మాత్రమే కంఠేశ్వర్ రైల్వే అండర్ పాస్ ఉపయోగించాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Railway Station | కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిశీలించిన రైల్వే జీఎం