Minister Ponguleti | ప్రభుత్వ భూమిని మామకు కట్టబెట్టిన హరీశ్​రావు : మంత్రి పొంగులేటి

హరీశ్​రావు తన మామపేరుపై సిద్ధిపేట జిల్లా వెలికట్టి గ్రామంలో 6.18 ఎకరాలఅసైన్డ్ భూమిని కొనుగోలు చేశారని మంత్రి పొంగులేటి ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | మాజీ మంత్రి హరీశ్​రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) తీవ్ర ఆరోపణలు చేశారు. హరీశ్​రావు (Harish Rao) తన మామపేరుపై సిద్ధిపేట (Siddipet) జిల్లా వెలికట్టి గ్రామంలో 6.18 ఎకరాలఅసైన్డ్ భూమిని కొనుగోలు చేశారన్నారు.

మంత్రి పొంగులేటి శనివారం అసెంబ్లీలో మాట్లాడారు. ఎకరం రూ.15 కోట్ల విలువ చేసే అసైన్డ్​ భూమిని హరీశ్​రావు కొనుగోలు చేశారన్నారు. తన పరపతి ఉపయోగించి 22-A నుంచి తొలగించి పట్టా భూమిగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ఇద్దరి పేర్లపై అలొకేషన్ చేసినట్లు చూపించారని పేర్కొన్నారు. వెలికట్ట గ్రామం సర్వేనెంబర్ 271 లో 327 ఎకరాల 9 గుంటల ప్రభుత్వం భూమి ఉందన్నారు. ఇందిరా గాంధీ హయాంలో ఈ భూమికి పీవోటీ యాక్ట్​లో పట్టాలు ఇచ్చారన్నారు. అగ్గిపెట్టల అబద్ధాల రావు అధికారంలో ఉన్నప్పుడు డైరెక్ట్​గా పట్టా భూమి కింద కన్వర్ట్ చేసి తన మామకు పాస్ బుక్కులు ఇచ్చారని ఆరోపించారు. ఎంత పిల్లనిచ్చిన మామ అయినా.. పేదల భూమి అక్రమంగా ఇవ్వడం న్యాయమేనా అని ప్రశ్నించారు.

Minister Ponguleti | ఒక్క రూపాయి జీతంతో..

తాను ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేనస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.23 కోట్లు జీతం, అలెవెన్సుల రూపంలో తీసుకుని కనీసం ప్రజల సమస్యలు చర్చించడానికి అసెంబ్లీకి రాని కేసీఆర్​ రాజీనామా చేయాలన్నారు. అసలు అసెంబ్లీ రాకుండా.. మాక్ అసెంబ్లీ అనిపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు చేసిన డ్రామాలను, పిచ్చి వేషాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

దీనిని కూడా చదవండి : BRICS Declaration | ఉగ్రవాదంపై కఠిన వైఖరి.. బ్రిక్స్​ న్యూఢిల్లీ డిక్లరేషన్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *