అక్షరటుడే, వెబ్డెస్క్: Dancer Raju Arrest | సినిమా Cinema అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ‘ఢీ’ డ్యాన్స్ షో విన్నర్ డ్యాన్సర్ రాజును హైదరాబాద్లోని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 9న బాధిత యువతి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సినిమా అవకాశాల పేరుతో రాజు తనను లైంగికంగా వేధించాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించినట్లు తెలుస్తోంది.
Dancer Raju Arrest | నిందితుడు రిమాండ్
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్యాన్సర్ రాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించిన న్యాయస్థానం రాజుకు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.