అక్షరటుడే, వెబ్డెస్క్: Tukkuguda Demolitions | రంగారెడ్డి జిల్లా (Rangareddy District) తుక్కుగూడలో అక్రమ నిర్మాణలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నిర్మాణాలను కూల్చివేశారు.
శ్రీశైలం రహదారికి ఇరువైపులా తుక్కుగూడలో భారీగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఆయా నిర్మాణాల్లో పలు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఫిర్యాదులు రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రారంభించారు.
Tukkuguda Demolitions | తీవ్ర ఉద్రిక్తత
జీహెచ్ఎంసీ అధికారులను స్థానికులు అడ్డుకోడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడకు వచ్చారు. పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు. కూల్చివేతలు, నిరసనల కారణంగా శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి..: T20 Ticket Black Marketing | హైదరాబాద్లో టీ20 టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ గుట్టురట్టు.. నలుగురి అరెస్టు!