Hyderabad ATM theft | హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎం వ్యాన్ నుంచి రూ. 17 లక్షల మాయం!

హైదరాబాద్ నగరంలోని ఐఎస్ సదన్ పరిధిలో చోటుచేసుకున్న భారీ చోరీ తీవ్ర కలకలం రేపింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad ATM theft | హైదరాబాద్ నగరంలోని  ( Hyderabad ) ఐఎస్ సదన్ పరిధిలో చోటుచేసుకున్న భారీ చోరీ తీవ్ర కలకలం రేపింది. ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు, రూ. 17 లక్షల నగదు ఉన్న పెట్టెను ఎత్తుకెళ్లారు.

Hyderabad ATM theft | ఏం జరిగిందంటే..

ప్రైవేట్ క్యాష్ వ్యాన్‌లో వచ్చిన సిబ్బంది, ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వెళ్లే సమయంలో రూ. 17 లక్షల నగదు ఉన్న ట్రంకు పెట్టెను వాహనంలోనే ఉంచారు. ఇదే అదనుగా భావించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు, క్షణాల వ్యవధిలో ఆ పెట్టెను లాగేసి, ముందుగా సిద్ధం చేసుకున్న బైక్‌పై పరారయ్యారు.

atm.1

Hyderabad ATM theft | ట్విస్ట్ ఇచ్చిన డ్రైవర్..

ఈ కేసులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దోపిడీ జరిగిన కొద్దిసేపటికే క్యాష్ వ్యాన్ డ్రైవర్ అదృశ్యమయ్యాడు. సిబ్బంది ఏటీఎం సెంటర్ నుంచి బయటకు వచ్చి చూసేసరికి డబ్బుల పెట్టెతో పాటు డ్రైవర్ కూడా కనిపించలేదు. దీంతో ఈ చోరీ వెనుక డ్రైవర్ హస్తం ఉందని, తన సహచరులతో కలిసి అతడే ఈ ప్లాన్ వేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Hyderabad ATM theft | గాలింపు చర్యలు..

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను క్లూస్ టీమ్ పరిశీలిస్తోంది. పరారీలో ఉన్న డ్రైవర్, దుండగుల కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

ఇది కూడా చదవండి:  Hyderabad Metro controversy | మెట్రో ఆస్తులపై రేవంత్ కుట్రలు : కేటీఆర్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *