MP Arvind | ఫలించిన ఎంపీ అర్వింద్​ కృషి.. జగిత్యాల పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు

ఎంపీ ధర్మపురి అర్వింద్ ​కృషి ఫలించింది. జగిత్యాల పట్టణానికి బైపాస్​ రోడ్డు మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఆమోదం తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MP Arvind | ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind)​ కృషి ఫలించింది. జగిత్యాల పట్టణానికి బైపాస్​ రోడ్డు (Jagityal Bypass) మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఆమోదం తెలిపారు.

MP Arvind | జగిత్యాల జిల్లా ప్రజలకు..

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్​ మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా ప్రజలకు కేంద్రం మరో శుభవార్త తెలియజేసిందన్నారు. జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారి (NH-563) అభివృద్ధి పనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు. అంబారిపేట్, అంతర్గాం గ్రామాల వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాల అంశాన్ని తాను కేంద్ర రహదారులు, రవాణా శాఖ దృష్టికి తీసుకెళ్లగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి అధికారికంగా ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు.

MP Arvind | జగిత్యాల–కరీంనగర్​ రహదారిని..

జగిత్యాల–కరీంనగర్(Karimnagar) రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించడంతో పాటు జగిత్యాల పట్టణానికి బైపాస్ నిర్మాణ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎంపీ వెల్లడించారు. అంతేకాకుండా అంతర్గాం, అంబారీపేట గ్రామాల వద్ద అండర్ పాస్​ల నిర్మాణానికి సైతం ఆమోదం లభించిందన్నారు. ఈ పనులు పూర్తయిన అనంతరం ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జగిత్యాల జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి(Telangana Development) నిరంతరం కృషి కొనసాగిస్తానని ఎంపీ అర్వింద్​ ధర్మపురి పేర్కొన్నారు.

jag

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *