DSP Bheem Reddy | డీఎస్పీ భీంరెడ్డి డైరీలో కొత్త వివరాలు.. టాలీవుడ్ హీరో పేరు వెలుగులోకి?

ఆ డైరీలో ఓ టాలీవుడ్ హీరో పేరు నమోదు అయి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ నటుడికి రూ.3 కోట్ల మేర అప్పు ఇచ్చినట్లు డైరీలో నమోదు చేసినట్లు సమాచారం.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: DSP Bheem Reddy | అవినీతి ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్న డీఎస్పీ భీంరెడ్డి కేసులో విచారణకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న డైరీలో పలు కొత్త అంశాలు నమోదైనట్లు సమాచారం.

దర్యాప్తు సంస్థకు లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ డైరీలో ఓ టాలీవుడ్ హీరో పేరు నమోదు అయి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ నటుడికి రూ.3 కోట్ల మేర అప్పు ఇచ్చినట్లు డైరీలో నమోదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని కోరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

DSP Bheem Reddy

DSP Bheem Reddy | బినామీల పేర్లు..

డైరీలో భారీ మొత్తంలో ఆస్తులకు సంబంధించిన బినామీల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరిస్తున్న అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు, డైరీలో పేర్లు నమోదైన ప్రతి వ్యక్తిని విచారించి వాస్తవాలను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ORR Blackspots | ORRపై ప్రమాదాలకు చెక్.. 80 బ్లాక్‌స్పాట్స్‌పై ప్రత్యేక నిఘా!

అయితే, డైరీలో పేర్లు ఉండటం మాత్రమే సంబంధిత వ్యక్తులపై ఆరోపణలు రుజువైనట్లుగా భావించరాదని, విచారణ పూర్తయ్యాకే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *