అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ibrahimpatnam Road Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి చెందారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ కాలేజీకి చెందిన నలుగురు బీటెక్ ఫస్టియర్ విద్యార్థులు బుధవారం రాత్రి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ టాటా ఏసీ వాహనం వేగంగా వచ్చి వారిని ఢీకొంది. ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Ibrahimpatnam Road Accident | చికిత్స పొందుతూ..
క్షతగాత్రులను స్థానికులు మన్నెగూడ లోని మహానీయ హాస్పిటల్‌కు తరలించారు. అందులో తీవ్రంగా గాయపడ్డ వరంగల్‌కు చెందిన శివరాజ్ చికిత్స పొందుతూ చనిపోయాడు. కౌమిద్‌రెడ్డి, అక్షమ్, కార్తిక్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Cyber Frauds | ఫోన్లు చోరీ చేసి.. సైబర్ మోసాలు చేస్తున్న ముఠా