అక్షరటుడే, బాన్సువాడ: Banswada Student Death | పాఠశాలకు వెళ్తున్న ఏడేళ్ల బాలికను లారీ ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర ఘటన పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది.
Banswada Student Death | అతివేగం.. నిర్లక్ష్యం..
స్థానికుల వివరాల ప్రకారం.. లారీ డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ పాఠశాలకు వెళ్తున్న బాలికను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాలిక లారీ టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ (Banswada) ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. ఈ ఘటనతో బాన్సువాడ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి..: Kamareddy Hospital Death | గర్భసంచి చికిత్స కోసం వస్తే ప్రాణం పోయింది