Kamareddy Hospital Death | గర్భసంచి చికిత్స​ కోసం వస్తే ప్రాణం పోయింది

గర్భసంచి ఆపరేషన్​ కోసం వచ్చిన మహిళ మృతి ఆస్పత్రిలో ఆకస్మికంగా మృతి చెందింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Hospital Death | గర్భసంచి ఆపరేషన్​ కోసం వచ్చిన మహిళ ఆస్పత్రిలో ఆకస్మికంగా మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి(Kamareddy) పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది.

Kamareddy Hospital Death | జీవధాన్​ ఆస్పత్రిలో..

పట్టణంలోని జీవధాన్ ఆస్పత్రిలో గర్భసంచి తొలగింపు ఆపరేషన్ కోసం వచ్చిన లింగంపేటకు చెందిన పరిష రాజేశ్వరి అలియాస్ లాస్య (38) మృతి చెందింది. ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి అనస్థీషియా ఇవ్వగానే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో కేస్ షీట్ కూడా రాయలేదని, కుటుంబ సభ్యుల సంతకాలు తీసుకోకుండానే ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యంగా యాక్టివ్‌గా ఆస్పత్రికి వచ్చిన రాజేశ్వరి హార్ట్ స్ట్రోక్‌తో ఎలా చనిపోతుందని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆస్పత్రిలో వైద్యులు, కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలికి తొమ్మిదేళ్ల కూతురు శ్రీవల్లి, ఐదేళ్ల కుమారుడు వైభవ్ ఉన్నారు.

ఇది కూడా చదవండి: AP Drought Crisis | రాష్ట్రంలో కరువు ఉన్నా సీఎం స్పందించడం లేదు : వైఎస్​ జగన్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *