అక్షరటుడే, బాల్కొండ: Balkonda Ganja Arrests | దర్జాగా వరద కాలువపై గంజాయి (Ganja) సేవిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బాల్కొండ (Balkonda) మండలంలోని బుధవారం చోటు చేసుకుంది.
Balkonda Ganja Arrests | వన్నెల్(బి) గ్రామంలో..
మండలం వన్నెల్ (బి) (Vannel B) గ్రామంలోని వరద కాలువ గట్టు వద్ద కొంతమంది గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో బాల్కొండ పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గట్టుపై సుమారు 18మంది గంజాయి సేవిస్తున్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో వారికి గంజాయి విక్రయించేందుకు వచ్చిన మరో వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు.
విచారణలో గంజాయి విక్రయించేందుకు వచ్చిన వ్యక్తి వద్ద 40 గ్రాముల ఎండు గంజాయి, చిన్న చిన్న జిప్‌లాక్ కవర్ల ప్యాకెట్, ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. బానిసైన మిగతా 18 మందిని డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించనున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: యశ్ మూవీపై నెటిజన్ల ట్రోల్స్