Congress Mandal Presidents | నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ మండలాధ్యక్షుల నియామకం

నిజామాబాద్​ జిల్లాలోని ఆర్మూర్​, బాల్కొండ, నిజామాబాద్​ రూరల్​, బోధన్​ నియోజకవర్గాల్లోని మండలాలకు కాంగ్రెస్​ అధ్యక్షులను అధిష్టానం నియమించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Congress Mandal Presidents | నిజామాబాద్​ జిల్లాలోని ఆర్మూర్(Armoor)​, బాల్కొండ (Balkonda), నిజామాబాద్​ రూరల్​, బోధన్​ నియోజకవర్గాల మండలాలకు కాంగ్రెస్​ అధ్యక్షులను అధిష్టానం నియమించింది. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి సోమవారం ప్రకటన విడుదల చేశారు.

ఇప్పటి వరకు జిల్లాలో 25 మండల కాంగ్రెస్ అధ్యక్షులను, ముగ్గురు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించినట్లు నగేష్​ రెడ్డి పేర్కొన్నారు. బోధన్ (Bodhan)​ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి, బాల్కొండ ఇన్​ఛార్జి సునీల్ రెడ్డి సూచనల మేరకు.. తన ప్రతిపాదనలతో పీసీసీ చీఫ్​ ఈ నియామకాలను చేపట్టినట్లు నగేష్​రెడ్డి తెలిపారు.

Congress Mandal Presidents | అధ్యక్షులు వీరే..

ఆర్మూర్​ నియోజకవర్గంలో.. నాగరాజు రెడ్డి(ఆర్మూర్​), దయాకర్ రావ్(మాక్లూర్), ప్రమోద్(ఆలూర్), దూడ వెంకటేష్(నందిపేట్), బాబు రావ్(డొంకేశ్వర్), సాయి బాబా గౌడ్ (ఆర్మూర్ టౌన్). నిబామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మంగూరప్ రవి(మోపాల్), కిషన్ నేత(ఇందల్వాయి), మూత జనార్దన్(నిజామాబాద్ రూరల్), రాథోడ్ అంబర్ సింగ్(డిచ్​పల్లి), గాదె నరేష్(ధర్పల్లి),గడ్డం సంజీవ్ అలియాస్​ సురేష్​ (జక్రాన్​పల్లి), రొండ్ల గోవర్ధన్(సిరికొండ). బోధన్ నియోజకవర్గంలో రవి(సాలూర), నాగేశ్వర్ రావ్(బోధన్ మండల్), శ్రీనివాస్ గౌడ్(నవీపేట్), పులి శ్రీనివాస్(ఎడపల్లి), దామోదర్(బోధన్ టౌన్), మొబిన్(రెంజల్). బాల్కొండ నియోజకవర్గంలో.. సాట్ల ప్రవీణ్(బాల్కొండ), మల్లెల లక్ష్మణ్ (భీమ్​గల్​), బోనారి భాస్కర్(కమ్మర్​పల్లి), శివ కుమార్(ఎర్గట్ల), బక్కూరి ఆనంద్(మోర్తాడ్), కొల్వి శ్రీకాంత్ రెడ్డి(ముప్కాల్), రంగు అనిల్(వేల్పూర్), బడాలా సాయిరెడ్డి(మెండోరా),పర్స అనంత్ రావ్(భీమ్​గల్​ టౌన్) నియమితులయ్యారు.

nizamabad 2

ఇది కూడా చదవండి : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *