Congress Presidents | రూరల్ నియోజకవర్గ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు వీరే..

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులను ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి నియమించారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Congress Presidents | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని(Nizamabad Rural) ఏడు మండలాలకు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులను ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) నియమించారు.  ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.

Congress Presidents | అధ్యక్షులు వీరే..

అంబర్ సింగ్ రాథోడ్ (డిచ్​పల్లి), మూత జనార్ధన్(నిజామాబాద్ రూరల్), గడ్డం సంజీవ్ అలియాస్ గడ్డం సురేష్(జక్రాన్‌పల్లి), చింతల కిషన్ నేత(ఇందల్వాయి), గాదె నరేష్(ధర్పల్లి), రోండ్ల గోవర్ధన్ రెడ్డి(సిరికొండ), మంగురపు రవి(మోపాల్)లు నియామితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని నూతన అధ్యక్షులకు ఎమ్మెల్యే సూచించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ కార్యకలాపాలను విస్తరించి, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పార్టీ అధిష్ఠానం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, కాంగ్రెస్ పార్టీ విజయానికి, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆకాంక్షించారు. కాగా తమపై నమ్మకంతో అధ్యక్ష పగ్గాలు అప్పగించడంపై ఎమ్మెల్యేకు నూతన అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు.

congress1

ఇది కూడా చదవండి: ‘రేవంత్ రెడ్డి రైతుబంధు నిధులు జమ చేస్తానని..

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *