Chess Tournament | చెస్​ ఆడితే చదువులోనూ ముందుంటారు..

చెస్​ ఆడితే చదువులోనూ ముందుంటారని జిల్లా ఒలింపిక్​ అసోసియేషన్​ సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్​రావు అన్నారు. జిల్లాస్థాయి అండర్–11 బాలబాలికల చెస్ టోర్నీని నగరంలోని అభ్యాస స్కూల్​లో నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Chess Tournament | చెస్​ ఆడితే చదువులోనూ ముందుంటారని జిల్లా ఒలింపిక్​ అసోసియేషన్ (Olympic Association)​ సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్​రావు అన్నారు. జిల్లాస్థాయి అండర్–11 బాలబాలికల చెస్ టోర్నీని Chess Competition) నగరంలోని అభ్యాస స్కూల్​లో నిర్వహించగా ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Chess Tournament | చెస్​తో మెదడు చురుకుగా..

ఆయన మాట్లాడుతూ.. చెస్​ ఆడితే మెదడు చురుకుగా మారుతుందని.. తద్వారా చదువులోనూ రాణించవచ్చన్నారు. విద్యార్థులు((Nizamabad) చెస్​ ఆడేందుకు ఆసక్తి చూపాలన్నారు. జిల్లాస్థాయి చెస్​ టోర్నీలో బాలుర విభాగంలో ఆర్మూర్​ మోడల్​ స్కూల్​ విద్యార్థి డీ సోహన్​, ప్రెసిడెన్సీ స్కూల్​ విద్యార్థి అర్జున్​ విజయం సాధించారు. అలాగే బాలికల విభాగంలో విజయసాయి స్కూల్​ బోధన్​ విద్యార్థిని నిత్యశ్రీ, సహారా కింగ్​టౌన్​ బోధన్​ స్కూల్​ విద్యార్థిని ఎస్​ సాయి విజేతగా నిలిచారు. కార్యక్రమంలో చెస్​ అసోసియేషన్​ ప్రతినిధులు రమేష్​, ఆర్డిటర్​ శివ, సాయిబాబా పాల్గొన్నారు.

chess11

ఇది కూడా చదవండి: ఓజీ సీక్వెల్ పనులు మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్..

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *