US Iran Peace Talks | అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు ప్రారంభం.. విఫలమైతే దాడులు చేస్తామన్న ట్రంప్​

స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్‌ శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. పశ్చిమాసియాలో సంక్షోభాన్ని ముగించాలనే ఉద్దేశంతో రెండు దేశాలు చర్చల్లో పాల్గొన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Iran Peace Talks | స్విట్జర్లాండ్‌లో US-ఇరాన్‌ శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. పశ్చిమాసియాలో సంక్షోభాన్ని ముగించాలనే ఉద్దేశంతో రెండు దేశాలు చర్చల్లో పాల్గొన్నాయి. ఈ చర్చలు సఫలం అయితే యుద్ధం ముగిసి ప్రపంచ వ్యాప్తంగా చమురు, ఆర్థిక సంక్షోభం తప్పనుంది.

చర్చలు పలు అంశాల్లో పురోగతి సాధించాయని అమెరికా వైస్​ ప్రెసిడెంట్​ జేడీ వాన్స్​ తెలిపారు. శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామన్నారు. చర్చలకు జేడీ వాన్స్‌, ట్రంప్ అల్లుడు కుష్నర్ హాజరు అయ్యారు. సమావేశానికి ముందు పాక్ ప్రధానిని జేడీవాన్స్ కలిశారు. ఇరాన్‌ తరపున ఘాలిఫ్,అరాఘ్చీ చర్చల్లో పాల్గొన్నారు.

US Iran Peace Talks | పాక్​ మధ్యవర్తిత్వం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ఎలక్ట్రానిక్‌గా ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసిన తర్వాత, ఆదివారం నాటి ఈ చర్చలకు పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. స్విట్జర్లాండ్‌లో గల్ఫ్ దేశం, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ప్రారంభమైనట్లు ఖతార్ విదేశాంగ శాఖ ప్రకటించింది. యుద్ధాన్ని ముగించేందుకు కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని అన్ని పక్షాలు పూర్తిగా అమలు చేసేలా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘలిబాఫ్ మరియు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ నేతృత్వంలోని ఇరాన్ ప్రతినిధి బృందం పేర్కొంది.

US Iran Peace Talks | ట్రంప్​ వార్నింగ్​

ఓ వైపు చర్చలు జరుగుతుంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ ఇరాన్​కు వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలం అయితే ఇరాన్​పై మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించారు. గత వారం ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడిని గుర్తుచేస్తూ, లెబనాన్‌లోని తమ ప్రాక్సీలైన హిజ్బుల్లాను “సమస్యలు సృష్టించకుండా” ఇరాన్ ఆపకపోతే, అదే తరహా లేదా అంతకంటే తీవ్రమైన దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ అన్నారు.

దీనిని కూడా చదవండి:  NEET Exam | ‘నీట్’ అభ్యర్థికి సీఐ చేయూత.. పోలీస్​ వాహనంలో పరీక్ష కేంద్రానికి..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *