Collectorate Vehicle Checks | కలెక్టరేట్​లో పోలీసుల విస్తృత తనిఖీలు

నిజామాబాద్​ కలెక్టరేట్​లో సోమవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్: Collectorate Vehicle Checks | నిజామాబాద్​ కలెక్టరేట్​లో సోమవారం పోలీసులు (Nizamabad Police) విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోకి వెళ్లే ప్రతి వాహనదారుడి లైసెన్స్​, ఇతర ధ్రువపత్రాలను పరిశీలించారు..

Collectorate Vehicle Checks | ఉద్యోగులే నంబర్​ ప్లేట్​ లేకుండా..

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. కలెక్టరేట్​కు (Nizamabad Collectorate) వచ్చే ఉద్యోగులు, ఇతరులు వాహనాలకు నంబర్​ప్లేట్లు లేకుండా.. ప్లేట్​లను కిందికి వంచేసి కనిపించకుండా చేస్తున్నారన్నారు. ఇది చట్టరీత్యానేరమన్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రత్యేక డ్రైవ్​ నిర్వహించినట్లు వారు తెలిపారు. నంబర్​ప్లేట్స్​ లేకుండా.. ఉన్నా వాటిని అడ్డదిడ్డంగా అమర్చిన వాహనాలను ఆపి కౌన్సెలింగ్​ ఇచ్చామని.. మరికొంతమందిపై పెట్టి కేసులు పెట్టామని తెలిపారు. సుమారు 50మందికి జరిమానాలు విధించినట్లు చెప్పారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *