Tractor Accident | ట్రాక్టర్ కింద గంటన్నరపాటు నరకయాతన.. స్థానికుల సమయస్ఫూర్తితో బయటపడ్డ వ్యక్తి

ట్రాక్టర్ ఇంజిన్ మీద పడటంతో ఎటూ కదల్లేని స్థితిలో ఓ వ్యక్తి గంటన్నర పాటు నరకయాతన అనుభవించాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Tractor Accident | ట్రాక్టర్ ఇంజిన్ మీద పడటంతో ఎటూ కదల్లేని స్థితిలో ఓ వ్యక్తి  గంటన్నర పాటు నరకయాతన పడ్డాడు. ఈ ఘటన డిచ్​పల్లి మండలం మెంట్రాజ్​పల్లిలో జరిగింది.

Tractor Accident | డిచ్​పల్లి మండలం సాంపల్లికి చెందిన..

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. డిచ్​పల్లి మండలం (Dichpalli Mandal) సాంపల్లి గ్రామానికి చెందిన మాసూరి సుభాష్ తన ట్రాక్టర్​పై మెంట్రాజ్ పల్లి కొచ్చేరుకు వెళ్లాడు. చెరువు కట్టపై ఉన్న ట్రాలీని తీసుకొచ్చే క్రమంలో ట్రాక్టర్ ఇంజిన్ ఒక్కసారిగా కట్ట కిందకు జారిపోయి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ ఇంజిన్ కింద సుభాష్ ఎటూ కదల్లేని స్థితిలో ఇరుక్కున్నాడు. దీంతో ఆయన అరుపులు, కేకలు వేశాడు. చెరువు కట్ట ప్రాంతంలో పొలం పనుల్లో ఉన్న రైతులు, విద్యుత్ సిబ్బంది వచ్చి వెతకగా ఈత చెట్ల మధ్యలో ట్రాక్టర్ ఇంజిన్ కింద సుభాష్ కాళ్లు కనిపించాయి. వెంటనే మెంట్రాజ్ పల్లి, సాంపల్లి గ్రామస్థులకు సమాచారం ఇచ్చి వాట్సాప్ గ్రూప్​లలో సమాచారాన్ని పోస్ట్​ చేశారు.

జేసీబీని రప్పించిప్పటికీ ట్రాక్టర్ ఇంజిన్ వరకు వెళ్లే మార్గం కనిపించలేదు. దీంతో సాంపల్లి ఇటుక బట్టీలోని క్రేన్​ను తెప్పించారు. చెట్ల మధ్యలో ఉన్న ట్రాక్టర్ ఇంజిన్​ను ఎట్టకేలకు పైకి లేపడంతో ఇంజన్ కింద ఇరుక్కున్న సుభాష్​ బయటపడ్డాడు. గంటన్నర పాటు ట్రాక్టర్ కింద ఊపిరి బిగపట్టి బిక్కుబిక్కుమని గడిపిన సుభాష్ క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితుడిని వెంటనే ‘108’లో నిజామాబాద్​లోని ఆస్పత్రికి తరలించారు. మెంట్రాజ్ పల్లి, సాంపల్లి స్థానికులు క్షణాల్లో ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు యువకుడి ప్రాణాలు కాపాడారు.

ఇది కూడా చదవండి..: Urea Controversy | యూరియా పేరుతో రైతులను రెచ్చగొడితే ఊరుకునేది లేదు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *