హైదరాబాద్Shamirpet Tahsildar Bribe | రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన తహశీల్దార్

Shamirpet Tahsildar Bribe | రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన తహశీల్దార్

శామీర్‌పేట్‌ తహశీల్దార్​ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తహశీల్దార్ సుచరిత రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shamirpet Tahsildar Bribe | మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఏకంగా రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా ఓ తహశీల్దార్​ను ఏసీబీ అధికారులు (ACB Officers) రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

హైదరాబాద్​ నగర శివారులోని శామీర్‌పేట్‌ తహశీల్దార్​ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తహశీల్దార్ సుచరిత ఓ వ్యక్తి నుంచి రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో ఫైళ్లను పరిశీలిస్తున్నారు. కాగా తహశీల్దార్​ డ్రైవర్​ లంచం తీసుకొని ఆమెకు ఇస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. కార్యాలయ సిబ్బందిని సైతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Shamirpet Tahsildar Bribe | జోరుగా అవినీతి

రాష్ట్రంలోని తహశీల్దార్​ కార్యాలయాల్లో అవినీతి జోరుగా సాగుతోంది. పలువురు అటెండర్ల నుంచి తహశీల్దార్ల వరకు లంచాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) నగర శివారులోని తహశీల్దార్​ కార్యాలయాల్లో కాసుల వర్షం కురుస్తోంది. అక్కడ భూముల రేట్లు భారీగా ఉండటంతో ఏ పనికైనా అధికారులు భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తహశీల్దార్​ సుచరిత రూ.20 లక్షలతో దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఓ సామాన్యుడు జీవితాంతం కష్టపడ్డ అంత డబ్బు సంపాదించలేడు. కానీ అవినీతి అధికారులు ఒక్కరోజులో అక్రమంగా అర్జిస్తున్నారు. అయినా ఇలాంటి వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం లేదు.

కాగా శామీర్​పేట తహశీల్దార్​ కార్యాలయం (Shamirpet Tahsildar Office)లో భారీగా అవినీతి జరుగుతున్నట్లు సమాచారం. గతంలో సైతం ఓ తహశీల్దార్​ లంచం తీసుకుంటూ దొరికాడు. రెండేళ్ల క్రితం రూ.పది లక్షల లంచంతో శామీర్పేట తహశీల్దార్ పట్టుబడ్డాడు. తహశీల్దార్ ఆదేశాల మేరకు డబ్బు తీసుకుంటున్న డ్రైవర్ బద్రిని ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు. అనంతరం తహశీల్దార్, డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి..: Working Women Safety | వర్కింగ్ ఉమెన్ భద్రత ప్రభుత్వ బాధ్యత : మంత్రి సీతక్క

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bandi Bhagirath Custody | బండి భగీరథ్​ పోలీస్​ కస్టడీకి కోర్టు అనుమతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath Custody | బండి భగీరథ్​పై...

Vijay Krishna | బీజేవైఎం రాష్ట్ర కోశాధికారిగా అమంద్ విజయ్ కృష్ణ

అక్షరటుడే, ​నిజామాబాద్ సిటీ: Vijay Krishna| బీజేవైఎం (యువమోర్చా) (BJYM Telangana) రాష్ట్ర...

Population Change Committee | దేశంలో జనాభా మార్పులపై కేంద్రం కీలక నిర్ణయం

అక్షరటుడే‌ వెబ్‌‌డెస్క్: Population Change Committee | దేశంలో వేగంగా మారుతున్న...

Hyderabad Passport Services | బక్రీద్ సెలవుతో మే 28 నాటి పాస్‌పోర్ట్ స్లాట్స్.. మే 27కే రీషెడ్యూల్

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Passport Services | బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ...